శృతితగ్గిన సింబా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యానిమేటెడ్ మూవీ లవర్సంతా -‘ది లయన్ కింగ్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నది నిజం. ముఫాసా కొడుకు సింబా ఎలాంటి విచిత్రాన్ని చూపించబోతున్నాడో... ఎలాంటి ఎమోషన్స్ పంచబోతున్నాడోనన్న ఆసక్తి లేకపోలేదు. జంగిల్ యానిమేషన్ మూవీగా వస్తోన్న చిత్రం -ది లయన్ కింగ్. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 19న సినిమా విడుదలవుతోంది. పిల్లల్లో ఆసక్తి పెంచేందుకు -ఆయా భాషల్లోని ప్రముఖుల గొంతులతో జంతువుల పాత్రలకు డబ్బింగ్ చెప్పించడం వరకూ బాగనే ఉంది. కాకపోతే -లయన్ కింగ్ సింబా పాత్రకు తెలుగులో నాని డబ్బింగ్ చెప్పడం గర్జన తగ్గందా అన్నట్టుంది. తాను డబ్బింగ్ చెప్పిన వీడియోను ట్విట్టర్లో టీజర్‌లా పోస్ట్ చేశాడు నాని. -‘మా నాన్న ఓసారి చెప్పారు. సూర్య కిరణాలు పడే చోటంతా రక్షించాలని’ అంటూనే.. ‘నేను సింబా. ముసాఫా కొడుకుని’ అన్న డైలాగ్ వినిపించాడు. నాని డైలాగ్ మీద ముఫాసా అడుగుల్లో సింబా అడుగులేస్తున్నట్టు చూపించిన క్లిప్పింగ్ అద్భుతంగా ఉంది. కాకపోతే, క్లిప్పింగ్‌ని ఎలివేట్ చేసేంత బలంగా నాని గర్జన లేదనిపించింది. ఎమోషనల్ మాడ్యులేషన్స్‌ని గొంతులో అద్భుతంగా పలికించగల నాని -సింబాగా ఎంతవరకూ ఆకట్టుకుంటాడో చూడాలి. తెలుగు వర్షన్‌కు సంబంధించి మిగతా పాత్రలకి జగపతిబాబు, బ్రహ్మానందం, అలీ, రవిశంకర్ వాయిస్ ఇచ్చారు. మెస్మరైజ్ చేయతగ్గ యానిమేషన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న చిత్రానికి -డబ్బింగ్ గొంతులు ఎంత బరువు మోయగలవన్న సందేహాలు లేకపోలేదు. బాగా అలవాటు పడిన గొంతులు పూర్తి ప్లస్ కావొచ్చు, పూర్తగా మైనస్సూ కావొచ్చని అంటున్నారు సినిమా నిపుణులు. రియాలిటీకి ఏమాత్రం తగ్గకుండా యానిమేషన్‌లో అద్భుతమైన అటవీ ప్రపంచాన్ని, అందులో మాట్లాడే జంతువులను సృష్టించిన డిస్నీ -ఆడియన్స్‌ని ఎలా మైమరిపిస్తుందో చూడాలి.