నిర్మాతగా అనసూయ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనసూయ నిర్మాతగా మారబోతోందంటూ చాలాకాలంగా వినిపిస్తోన్న మాట. ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి, తనదైన గ్లామర్‌తో బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా ఎదిగింది. జబర్దస్త్ షోతోనే పాపులార్టీ అందుకున్న అనసూయ, తరువాత పలు టీవీ కార్యక్రమాల్లో యాంకర్‌గా బిజీ అయ్యింది. ఆ క్రేజ్‌తోనే సిల్వర్ స్క్రీన్‌పైనా అడుగుపెట్టిన అనసూయ, రంగస్థలం సినిమాతో తిరుగులేని పాపులార్టీ సంపాదించుకుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో లీడ్‌రోల్ చేసే స్థాయికి ఎదిగిన అనసూయ, తాజాగా మెగాస్టార్- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కే 152వ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోందట. అమెరికాలో జరుగుతున్న తానా వేడుకలకు హాజరైన అనసూయ -్భవిష్యత్‌లో నిర్మాత కాబోతున్నానంటూ ప్రకటించేసింది. కానె్సప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ నిర్మించాలని ఉందని, కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించాలని చెప్పింది. త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌నూ నిర్మించనుందట.