చల్ చల్ గుర్రం పాటల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శైలేష్, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన తారాగణంగా ఎం.ఆర్.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మో హన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య రూపొందిస్తున్న చిత్రం ‘చల్ చల్ గుర్రం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ సీడీని హీరో శ్రీకాంత్ విడుదల చేయగా, ఆడియో సీడీని తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి తొలి కాపీని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకాంత్ మాట్లాడుతూ, శైలేష్ తన తొలి సినిమా ‘ముకుంద’లోనే నటనపరంగా ఆకట్టుకున్నాడని, కార్ రేసర్‌గా అనేక పోటీలలో విజయం సాధించాడని తెలిపారు. ఇప్పుడు సోలో హీరోగా వస్తున్న ‘చల్ చల్ గుర్రం’ విజయవంతం కావాలని, ఈ సినిమా ట్రైలరు, పాటలు బాగున్నాయని, సంగీత దర్శకుడు వెంగీకి, హీరోకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నానన్నారు. సినిమా విజువల్ పరంగా గ్రాండియర్‌గా వుందని, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రంలో పాటలన్నీ హైలెట్‌గా వున్నాయని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అన్ని రకాల ఎమోషన్లు, పాత్రలో వేరియేషన్లతో ‘చల్ చల్ గుర్రం’ రూపొందిందని, హీరో కొత్తవాడైనా రిస్కీ షాట్లన్నీ ఈజీగా చేశాడని దర్శకుడు మోహన ప్రసాద్ తెలిపారు. బడ్జెట్‌లోనే సినిమాని రూపొందించామని, ఎమోషనల్ కథనానికి ఇద్దరు హీరోయిన్లు అవసరం వుంది కనుక తీసుకున్నామని, వారిద్దరూ సినిమాకు న్యాయం చేశారని ఆయన తెలిపారు. వెంగీ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. ఈ సినిమా ఆడియోను, అలాగే సినిమాను మంచి అభిరుచితో సినిమా చూసేవారికోసం రూపొందించామని, తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని నిర్మాత ఎం.రాఘవయ్య అన్నారు. మెలోడీ ప్రధానంగా రూపొందించిన పాటలన్నీ మాస్, వెస్ట్రన్ బీట్‌తో ఆకట్టుకుంటాయని, పాటలన్నీ వైవిధ్యంగా సాగుతాయని, అందరికీ నచ్చుతాయని నమ్మకం వుందని సంగీత దర్శకుడు వెంగీ తెలిపారు. పాటలన్నీ విజువల్‌గా సూపర్‌గా వుంటాయని, సినిమాను దర్శకుడు తాను చెప్పినదానికన్నా చక్కగా చిత్రీకరించారని, అలాగే నిర్మాత మంచి నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్ అవుతాయని, వెంగీ సంగీతం వినడానికి చక్కగా వుందని హీరో శైలేష్ తెలిపారు. కార్యక్రమంలో హీరో తరుణ్, చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:శంకర్, కెమెరా:శ్యాంప్రసాద్, ఆర్ట్:జె.కె.మూర్తి, సంగీతం:వెంగీ, ఫైట్స్:రామ్ సుంకర, డాన్స్:రఘు, ప్రదీప్, నిర్మాత:ఎం.రాఘవయ్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:మోహన ప్రసాద్.