పాట దాటాడు.. బాణీ పట్టాడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాకు పాటనే ప్రాణం చేసిన గమ్మతె్తైన గాత్రం -సిధ్ శ్రీరామ్‌ది. తమిళంలో ‘ఎన్నోడు నీ ఇరుందాల్’ అంటూ హైపిచ్‌లో గొంతువిప్పి పాట పిచ్ పెంచేశాడు సిధ్. టిక్ టిక్ టిక్ కోసం ‘కురంబా కురుంబా’ అన్నా, విశ్వాసం సినిమాలో ‘కన్నాన కనే్న’ అంటూ ఆర్ద్రత పలికించినా -గాత్రంలోని మార్దవం మాత్రం శ్రోతల మెదళ్లలో పర్మినెంట్ ప్లేస్ తీసుకుంది. పాడింది తక్కువే అయినా -పల్లవించిన పాటగాళ్లకంటే పెద్ద పేరే వచ్చేసింది. తెలుగులో వచ్చిన ఆర్‌ఎక్స్ 100 సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందంటే -అందులో సిధ్ పాడిన ‘ఉండిపోరాదే’ పాటకు భాగస్వామ్యం లేదని ఏంతమాత్రం అనలేం. కర్నాటిక్ సంగీత కుటుంబం నుంచి వచ్చి, పాశ్చాత్య పోకడలో గాత్రానికి మెరుగులద్ది చిత్రమైన మాధుర్యాన్ని రుచి చూపించిన సిధ్ -తన నైపుణ్యంతో మొత్తానికి ప్రమోషన్ కొట్టేశాడు. ఏఆర్ రెహ్మాన్ నుంచి పలువురి సంగీత దర్శకులను మెప్పిస్తూ వచ్చిన సిధ్ -ఇప్పుడు తనే సంగీత దర్శకుడి అవతారం ఎత్తుతున్నాడు. అదీ -గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం క్రియేటివ్ స్టోరీకి. తనదగ్గర అసోసియేట్‌గా చాలాకాలం పనిచేసిన ధనశేఖరన్ దర్శకుడిగా ‘వానం కొట్టాటుం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. విక్రమ్ ప్రభు, ఐశ్వర్యా రాజేష్‌లు హీరో హీరోయిన్లు. ఈ సినిమాకు కథ, మాటలు మణిరత్నమే. ఆయన క్రియేట్ చేసిన స్టోరీకి మ్యూజిక్‌ను కంపోజ్ చేస్తున్నది సిధ్. గొప్ప అవకాశం కదూ. పిచ్ పెంచి గొంతులోకి వచ్చేసిన ఈ పాటగాడు -బాణీలతో మనసు లోతుల్లోకి వచ్చేస్తాడేమో చూడాలి.