మన్మథుడి రూటేంటో!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈ వయసులో లవ్ ఫెయలైతే.. తట్టుకోవం కష్టమే’ అంటుంది అవంతిక -రాబోయే మన్మధుడు2 సినిమాలో. ఇది హీరో నాగార్జున కెరీర్ లైఫ్‌కు అన్వయిస్తే -ఈ సినిమా తరువాత కొత్త టర్న్ తీసుకుంటాడా? కుర్ర పాత్రలే కంటిన్యూ చేస్తాడా? అన్న చర్చ తెరమీదికొస్తోంది.

కాస్త వయసొచ్చిన తరువాత కుర్ర వేషాలు పక్కన పెట్టాలన్న పెద్దల మాటను సీరియస్‌గా తీసుకుంటాడేమో చూడాలి. ఏళ్ల తరబడి తెలుగు హీరోగా సినిమాలు చేస్తున్నా -హాలీవుడ్ హీరోల మాదిరిగా ఫిట్‌నెస్ విషయంలో నాగ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ విషయాన్ని మళ్లీ మన్మథుడు-2 కసరత్తులు చెప్పకనే చెప్పాయి. కాకపోతే -్ఫజికల్ ఫెట్‌నెస్ ఓకే అనిపించినంత మాత్రాన ఆడియన్స్ ఆమోదం దొరుకుతుందా? అన్నదే వెంటాడుతున్న సందేహం. తోటి సీనియర్ ఆర్టిస్టులంతా తమ ఇమేజ్‌ను కంటిన్యూ చేసే జోనర్ సినిమాలను ఎంచుకుంటూ వెళ్తుంటే -నాగ్ మాత్రం ఏ చట్రంలోకీ ఇమడకుండా ఇప్పటి వరకూ జాగ్రత్తగానే అడుగులేస్తూ వచ్చాడు. సోగ్గాడే చిన్ని నాయినాలాంటి మాస్ అల్లరి సినిమాలతో అలరిస్తూనే, మనం, ఊపిరిలాంటి ఉదాత్తమైన చిత్రాల్లోనూ నాగ్ తనదైన శైలిని ప్రదర్శిస్తూ వచ్చాడు. ఉదారణకు చిరంజీవి సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన తరువాత సామాజిక, సమస్యాత్మక ఇతివృత్తాలు, పోరాట యోధుల కథలపైనే ఫోకస్ పెట్టడం చూస్తున్నాం. ఖైదీ నెంబర్ 150లో రైతు సమస్యను టచ్ చేస్తే, విడుదలకు సిద్ధమవుతున్న ‘సైరా’లో పోరాట యోధుడిగా కనిపించబోతున్నాడు. ఇక కొరటాల శివతో చేయబోయే ప్రాజెక్టు సైతం కమర్షియల్ కోణంలోనే సామాజికాంశానే్న ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక వెంకటేష్ చాలాకాలం క్రితం నుంచే కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌లతో తనదైన ట్రాక్ క్రియేట్ చేసుకున్నాడు. కుర్ర హీరోలు చేయడానికి అవకాశం లేని కథల్ని తనదైన శైలిలో ప్రజెంట్ చేస్తూ -వెంకటేష్ మార్క్ సినిమాలుగా బాట వేసేశాడు. ఇక బాలకృష్ణ సైతం ‘పైసా వసూల్’లో అల్లరి కుర్ర పాత్ర వికటించటంతో.. తనదైన మాస్ మార్క్ కథలు, బయోపిక్‌లపై దృష్టి పెట్టడం చూస్తున్నదే. బాలీవుడ్‌లో సైతం సీనియర్, వెటరన్ హీరోలంతా ‘ప్రత్యేక’మైన కథలతో తమకంటూ సెపరేట్ ట్రాక్ వేసుకుని ముందుకెళ్తున్న వాళ్లే. సమకాలీనుడైన నాగ్ మాత్రం -‘మన్మథుడి’ ఇమేజ్‌ను వదలకుండా ముందుకెళ్తుండటంలో విజయవంతమయ్యాడు. ఆగస్టు 9న రెండో మన్మథుడు థియేటర్లకు వస్తున్నాడు. దీని తరువాత నాగ్ ‘బిగ్‌బాస్’ హోస్ట్‌గా డిగ్నిఫైడ్ రోల్ పోషిస్తాడు. ఇక్కడినుంచి టర్న్ తీసుకుని -కెరీర్‌కు కొత్త షేప్‌నిస్తాడా? అన్నది చూడాలి.
మరి బంగార్రాజు?
నాగార్జున నిర్ణయం బంగార్రాజుపై ఎఫెక్ట్ పడుతుందా? అన్న చర్చా లేకపోలేదు. నాగ్ హిట్ చిత్రాల్లో -సోగ్గాడే చిన్నినాయన ఒకటి. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలో నాగ్ పోషించిన బంగార్రాజు పాత్ర ఆయనకి మరీ ఇష్టం. దీంతో దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ, నాగార్జున ఇద్దరూ ఆ చిత్రానికి సీక్వెల్‌కు ప్లాన్ చేశారు. సంక్రాంతి హిట్ సెంటిమెంట్‌తో ఈ సంక్రాంతికి బంగార్రాజును థియేటర్లకు తెవాలనుకున్నారు. బిగ్‌బాస్-3 ఎఫెక్ట్‌తో అది వచ్చే వేసవి సీజన్‌కు మారిందన్న టాక్ వినిపిస్తోంది. నాగ్ తన పంథాను కంటిన్యూ చేస్తే -బంగార్రాజు ఒకలా ఉండొచ్చు. వయసుకు తగ్గట్టుగా కెరీర్‌ను షేపప్ చేస్తే -ఆ బంగార్రాజు మరోలా ఉండొచ్చు. ఏదైనా -వెయిట్ అండ్ సీ.