అబ్బో.. రెబ్బా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్ మందగించినపుడు -క్రేజీ పాయింట్ వెతుక్కోవడం టాలీవుడ్ హీరోయిన్లకు అలవాటుగా అబ్బిన విద్యే. హీరోయిన్ అంటేనే ‘గ్లామర్’ అన్న సింబాలిక్ సైకాలజీకి ఆడియన్స్ సైతం ఫిక్సయ్యారు కనుక -చాలామంది హీరోయిన్లు అదే అస్త్రాన్ని స్క్రీన్‌పై ప్రయోగిస్తూ వస్తున్నారు. ఆ సీక్వెన్స్‌లో -ఈషా రెబ్బా పేరూ వినిపిస్తోంది. తెలుగమ్మాయిగా ‘షో’ కష్టమే అయినా -కెరీర్‌ను పరిగెత్తించాలంటే గ్లామర్ కళ్లాలు విదిలించాలన్న నిర్ణయానికి వచ్చిందట ఈషా. అవకాశాలు తగ్గిన టైంలో బికినీ ట్రిక్ ప్లే చేసి స్టార్ ఇమేజ్ అందుకున్న హీరోయిన్ల బాటనే అందుకు ఎంచుకుందని టాక్. బికినీ ట్రిక్ ప్లే చేసిన వాళ్లలో -సమంత, తమన్నా, నయనతార, పూజా హెగ్దె.. ఇలా పేర్లెన్నయినా ప్రస్తావిచొచ్చు. ఆ లిస్టులో ఈషా రెబ్బా కూడా చేరబోతోంది. పెర్ఫార్మెన్స్ స్టామినావున్నా -సరైన కథలు చేతికందక సక్సెస్ రూట్‌లో ఈషా వెనకపడిందన్నది నిజం. ఆమధ్య జూనియర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత..’ చిత్రంలోనూ తళుక్కుమన్న ఈషాకు -తరువాత చెప్పుకోదగ్గ చాన్స్‌లైతే రాలేదు. అందుకే -‘రాగల 24 గంటల్లో’ గ్లామర్ రూట్‌లోకి వచ్చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. కొంత గ్యాప్ తరువాత ‘్ఢమరుకం’ దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ప్రాజెక్టులో ఈషా రెబ్బా ‘బికినీ’లోనే ఇంట్రొడ్యూస్ కానుందని సమాచారం. గ‘మతె్తై’న బికినీ ప్రయోగం -ఈషా కెరీర్ పరుగులో ఎంత వేగం పెంచుతుందో చూడాలి.