సైకిల్‌పై లవ్ స్టోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పునర్ణవి భూపాలం, మహత్ రాఘవేంద్ర, శే్వతావర్మ, సూర్య లీడ్‌రోల్స్‌లో ఆట్ల అర్జున్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైకిల్. షూటింగ్‌తోపాటు డబ్బింగ్ కూడా పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్‌రెడ్డి మాట్లాడుతూ -ఇండియన్ సినిమాలో ఇంక చెప్పటానికేం లేవన్నన్ని కథలతో సినిమాలొచ్చాయి. ఐనా కొత్త కథలు రాస్తున్నాం, తీస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు ఇంజన్ కాని, ఇంధనంకానీ లేకుండా నడుస్తూ, మనతో కలిసి ప్రయాణిస్తున్న సైకిల్ పేరుని టైటిల్‌గా పెట్టుకుని ఫస్ట్‌సీన్‌లోనే దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ లింక్‌తో క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్ తీశాం. హీరో, హీరోయిన్స్‌తోపాటు సుదర్శన్, అనితాచౌదరి పాత్రలు మ్యాజిక్ చేస్తాయి. కామెడీ జోనర్ సినిమాకి బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ మ్యాజిక్ యాడ్ అయతే ఎంత కొత్తగా వుంటుందో ఈ చిత్రంలో చూస్తారన్నారు. త్వరలో టీజర్, ఆడియో రిలీజ్‌తో థియేటర్లకు వస్తోన్న చిత్రాన్ని పి.రాంప్రసాద్, డి.నవీన్‌రెడ్డి, వి.బాలాజీరాజు నిర్మించారు. సినిమాటోగ్రఫీ సిద్ధం మనోహర్, సంగీతం జి.ఎం.సతీష్ సమకూర్చారు.