తొలి పరవశమే.. అంటున్న గుణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తికేయ, అనఘ జోడీగా వస్తోన్న చిత్రం -గుణ 369. అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. చేతన్ భరద్వాజ్ కట్టిన బాణీల్లోని ‘తొలి పరిచయమా ఇది/ తొలి పరవశమా ఇది’ పాట వీడియో లిరికల్‌న్ నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ -అందరికీ నచ్చే ఫీల్‌గుడ్ సాంగ్. సినిమా సైతం ఇలాగే ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ -రియలిస్టిక్ ఇన్సిడెంట్స్‌ని కథగా మలచుకుని తెరకెక్కించిన సినిమా ఇది. చేతన్ కట్టిన బాణీ ప్రజలను మైమరిపించేలా ఉంది అన్నారు. నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ -దిల్‌రాజు ఆకాంక్ష మా నమ్మకాన్ని బలోపేతం చేసేదిలా ఉంది. ఆగస్టు 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తాం అన్నారు.