దొరసాని.. అలా వచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చమైన తెలంగాణ ప్రేమ కథతో వస్తోన్న చిత్రం -దొరసాని. టీజర్‌తోనే ఆసక్తిని పెంచిన దర్శకుడు కెవిఆర్ మహేంద్ర, 80లనాటి కథను తెరపై చూపించబోతున్నాడు. గడీల కాలంనాటి పరిస్థితుల్ని సున్నితమైన భావోద్వేగాలతో నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశానంటున్నాడు దర్శకుడు. ఎప్పుడో ఇరవైయేళ్ల క్రితం మొదలైన సంఘర్షణ కథలా తనను వెంటాడి -దొరసానికి ప్రాణం పోసిందన్నాడు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ జంటగా మహేంద్ర తెరకెక్కించిన భావోద్వేగ ప్రేమకావ్యం శుక్రవారం ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కెవిఆర్‌తో ఇంటర్వ్యూ.
మాది వరంగల్ జిల్లా జయగిరి. మధ్య తరగతి కుటుంబం. థియేటర్‌కెళ్లి సినిమా చూసే పరిస్థితులు ఉండేవి కావు. హైదరాబాద్ రావాలనే కల ఉండేది. అందుకే చిన్నప్పుడే హైదరాబాద్ వచ్చాను. ఫిల్మ్‌నగర్ హీరోలు, వాళ్ళ ఇళ్లు చూశా. అక్కడే ఓ సినిమా షూటింగూ చూశా. అది రాజశేఖర్ నటించిన అన్న సినిమా. అద్భుతం అనిపించింది. అప్పుడే అనుకున్నా, ఎప్పటికైనా ఇండస్ట్రీలో ఉండాలని. అదే ఈ జర్నీకి కారణం.
సినిమా ప్రయత్నాల్లోనే చదువు పూర్తి చేశా. 2002లో తొలిసారి పీపుల్స్ భారతక్క సినిమాకు పని చేశాను. దర్శకుడు మంచి సపోర్ట్ ఇచ్చాడు. తరువాత అనేక ప్రయత్నాలు కొనసాగాయి.
తెలంగాణ ఆవిర్భావ దిన్సోవం రోజది. హైదరాబాద్ అంతా వెలుగులతో మెరిసిపోతోంది. నా ఫ్రెండ్ కారులో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో తిరుగుతున్నాం. ఈ వెలుగులకు కారణమైంది ఎవరు? ఇంత పండుగ వాతావరణం వెనుక ఎవరి త్యాగముంది? ఈ సంబరాలకు అర్హులెవరు? అనే ప్రశ్నలు వెంటాడాయి. కానీ వాళ్లెవరూ ఇప్పుడు లేరు. సినీ మాధ్యమం ద్వారా ఏదో చెప్పాలనిపించింది. అలా ప్రయత్నం మొదలైంది.
ఆ రాత్రి పుట్టిన సంఘర్షణల ఫలితం నిశీధి షార్ట్ ఫిలిం. 14 నిమిషాలు బ్లాక్ అండ్ వైట్‌లో తీశా. ఒక పోరాటంలో అమరుని పాత్ర ఏమిటి? ఉద్యమం తాలూకు ఫలితం సమాజంలో ఎలావుంటుంది అనేదాన్ని చూపించగలిగాను. ఇది అంతర్జాతీయ వేదికమీద ప్రదర్శితమైతే తెలంగాణ ఉద్యమ విలువ ప్రపంచానికి తెలుస్తుందనుకున్నాం. ఆర్థిక సమస్యలూ వెంటాడాయి. నిశీధి కోసం పడిన కష్టానికి ఫలితంగా 18 దేశాలనుంచి 39 జాతీయ, అంతర్జాతీయ అవార్డులొచ్చాయి. ఆ షార్ట్ ఫిలింని చూసి ప్రముఖ ఫిలిం మేకర్ శ్యాం బెనగల్ ప్రశంసిస్తూ మెయిల్ రాశారు. ఈ నిశీధితో వచ్చిన స్పందన నాలో మరింత ఆత్మస్థయిర్యాన్ని పెంచింది.
నిశీధి తర్వాత నన్ను మరో కథ వెంటాడింది. దాన్ని 42 వర్షన్లు రాశాను. ఆ కథ -దొరసాని. అప్పటి తెలంగాణ గ్రామీణ, సామాజిక పరిస్థితులు ఎలాంటివి? అన్నీ చూపించాలి. అలాంటి వాతావరణాన్ని సృష్టించాలి. దొరల సామ్రాజ్యంలో గడీల వాతావరణాన్ని చూపించాలి. చాలా సహజంగా, వాస్తవికంగా నిజాయితీగా ఉంటుంది సినిమా. దర్శకుడిగా నా తొలి సినిమా. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ శివాత్మిక కూడా తొలి పరిచయమే. నిర్మాతలు నమ్మకంగా సపోర్టు చేశారు. కథ వినగానే సురేశ్‌బాబు ఓకె అన్నారు.
రాజశేఖర్ ఇంటికి కథ చెప్పడానికి వెళ్లినపుడు జీవితతో మాట్లాడుతూంటే కొంతసేపటికి శివాత్మిక అక్కడికి వచ్చిన స్టైల్ నాకు బాగానచ్చింది. అప్పుడే ఫిక్సయ్యా. ఈమే దొరసాని అని. అలా యాక్టర్ అవ్వాలన్న కోరిక బలంగావున్న ఆనంద్‌ను ఈ సినిమా తీసుకుంటే ఇద్దరి జోడీ బాగుంటుందనిపించింది. ఇద్దరికీ నటనలో శిక్షణ ఇచ్చాం. షూటింగ్‌లో దిగాక పాత్రల్లో లీనమయ్యారు.
నెక్స్ట్ సినిమా గురించి ఏమీ ఆలోచించలేదు. రేపు ప్రేక్షకుల నిర్ణయం బట్టి నెక్స్ట్ సినిమా ఏమిటన్నది ఆలోచిస్తా.