శాతకర్ణి ప్రారంభం రేపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందే వందో చిత్రం శుక్రవారంనాడు ప్రారంభం కానుంది. ఇటీవలే ఉగాది రోజున ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చిత్ర దర్శకుడు క్రిష్‌తో కలసి బాలకృష్ణ అమరావతిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అధికారికంగా రేపు హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. నాటి అఖండ భారతదేశాన్ని పాలించిన తొలి తెలుగు రాజు గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో నటిస్తున్నారు బాలకృష్ణ. తెలుగువాడైన చక్రవర్తి జీవితకథనే ఇతివృత్తంగా తీసుకుని తన వందవ సినిమాకు భారీ సన్నాహాలు మొదలుపెట్టారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపు వెల్లడి కానున్నాయి.