ఆమె వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెనే్సషనల్ హీరోయిన్ అమలపాల్ నటించిన తొలిథ్రిల్లర్ సినిమా ఆమె. ‘ఆడై’ సినిమాకు తెలుగు వర్షన్ ఇది. భిన్నమైన కానె్సప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకు రతన్‌కుమార్. అమలాపాల్ బోల్డ్‌లుక్ కూడా సంచలనం సృష్టించింది. జూలై 19న సినిమా విడుదల కానుంది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చరిత్ర చిత్ర ప్రొడక్షన్స్ సంస్థలో ‘ఆమె’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ- ఈ పోస్టర్ విడుదల చేస్తుంటే నాకు 25 ఏళ్ళు వెనక్కి వెళ్లినట్లు అనిపించింది. నాకు మంచి జీవితాన్ని ఇచ్చిన చిత్రం ఆమె. ఇపుడు ఈ చిత్రం డిపరెంట్ కానె్సప్టుతో వస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- నేను చేసిన సినిమా తెలుగులో విడుదలవుతున్నందుకు ఆనందంగా ఉంది. మా సినిమాను ఓ సెన్సార్ బోర్డు లేడీ చూసి మెచ్చుకున్నారు. జూలై 19న చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. అమలాపాల్ మాట్లాడుతూ- ఫార్ములా సినిమాలను చేసి బోర్ కొడుతున్న సమయంలో నాకు ఈ స్క్రిప్ట్ వచ్చింది. చదివి ఇంగ్లీష్ సినిమాకు కాపీ అనుకున్నా. చాలా ధైర్యంగా నటించా. ఈ సీన్ చూసి అనురాగ్ కశ్యప్‌గారు అన్నమాటలను అంత తేలికగా మర్చిపోలేను. ఇందులో నగ్నత్వం కన్నా నా కళ్ళల్లో ఎక్కువ బాధ కనిపించిందని ఆయన అన్న మాటలను మర్చిపోలేనన్నారు అన్నారు.