బడిదొంగ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేబి శ్రీనిత్య సమర్పణలో సన్ మీడియా కార్పొరేషన్ బ్యానర్‌పై మహేష్ సూర్య సిద్ధగోని నటిస్తూ దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘బడిదొంగ’. ఇషికవర్మ, రవికిరణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం లోగోను వ్యాపారవేత్తలు రవీందర్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో దర్శక నిర్మాత మహేష్ సూర్య మాట్లాడుతూ- ఈటీవీలో నేరాలు-ఘోరాలు, పలు యాడ్ ఫిల్మ్స్ రూపొందించిన అనుభవంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాను. రావణుడు సీతను అపహరిస్తే ఆంజనేయుడు లంకకి వెళ్లొచ్చాడు. రాముడు వెళ్తే ఏమిటనేది ఈ సినిమా స్టోరీలైన్. రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నాం అన్నారు. అతిథిగా హాజరైన రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ- టైటిల్ ఇన్నోవేటివ్‌గా వుంది. సినిమా కూడా అలాగే వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. ఈ సినిమా హిట్ కావాలని, నటీనటులకు మంచి పేరు రావాలని మరో అతిథి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. హీరోయిన్ ఇషిక వర్మ మాట్లాడుతూ- హీరోయిన్‌గా ఇదే నా తొలి చిత్రం. అంతకుముందు గోవిందుడు అందరివాడేలే, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి చిత్రాల్లో నటించాను. చిత్రం సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను అన్నారు.