కూల్ ‘భీష్మ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్ శ్రీనివాస కళ్యాణం విడుదలై ఏడాది దాటుతోంది. ఇంత గ్యాప్పా అనుకుంటున్న టైంలో -వరుసగా మూడు ప్రాజెక్టులు ప్రకటించి షాక్‌నిచ్చాడు నితిన్. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ‘భీష్మ’, వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ‘రంగ్‌దే’ ప్రకటిస్తూనే విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్‌లో మరో సినిమాకు సైన్ చేశాడు. మూడూ షూటింగ్ దశలో ఉన్నాయి. ‘్భష్మ’లోని నితిన్ లుక్ తాజాగా రివీలైంది. వైట్ ప్యాంటు, బ్లాక్ టీషర్ట్ టక్ చేసి, ఎవరినో అడ్రెస్ చేస్తూ మాట్లాడుతున్నట్టు నితిన్ క్లాసిక్ లుక్‌ని రివీల్ చేశారు. ఈ ప్రాజెక్టులో నితిన్‌తో రష్మిక మండన్న జోడీ కడుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ సినిమా నిర్మిస్తున్నారు. నవంబర్‌లో సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.