27న బైలంపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారా క్రియేషన్స్‌పై బ్రహ్మానందరెడ్డి నటిస్తూ నిర్మించిన చిత్రం -బైలంపూడి. ఒక ఊళ్లో జరిగే వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. హరీష్ వినయ్, తనిష్క తివారి హీరో హీరోయిన్లు. దర్శకుడు అనిల్ పి.జి రాజ్ తెరకెక్కించిన చిత్రం 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు సాగర్ మాట్లాడుతూ -కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా వస్తోన్న సినిమా ఇది. నిర్మాత బ్రహ్మానందరెడ్డి మంచి పాత్ర పోషించారన్నారు. బెనర్జీ మాట్లాడుతూ -బైలంపూడి పేరు విన్నా, చూసినా చరిత్ర గుర్తుకొస్తుంది మనకు. అలాంటి కథను నా స్నేహితుడు బ్రహ్మానందరెడ్డి చేయడం హ్యాపీగా ఉంది అన్నారు. కమెడియన్ ఆలీ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ -గెలవాలంటే పరిగెత్తాలి, యుద్ధం చేయాలి. ఆ కసితోనే ఇండస్ట్రీకి వచ్చాను. నా విజయాన్ని కాంక్షిస్తూ ఎంతోమంది సహకరించారు. అందరికీ ధన్యవాదాలు అన్నారు. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ -కెమెరామెన్‌కు దర్శకుడి ప్రమోషన్ ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. బైలంపూడి అనే ఊళ్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా సినిమా తీశాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతో సహకరించారు. వైవిధ్యమైన కథతో వస్తున్న చిత్రబృందాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నా అన్నారు.