భీష్మలో హెబ్బా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో నితిన్ చేస్తోన్న తాజా ప్రాజెక్టు -భీష్మ. వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న చిత్రంలో రష్మిక కథానాయిక. సింతార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న చిత్రాన్ని డిసెంబర్‌లో ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు చిత్రబృందం సమాయత్తమవుతోంది. ఈ ప్రాజెక్టులోకి తాజాగా మరో బ్యూటీ కూడా చేరినట్టు సమాచారం. ఓ కీలక పాత్రలో హెబ్బాపటేల్ సందడి చేయనుందట. చిన్న పాత్రే అయినా మంచి పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉండటంతో హెబ్బా సైన్ చేసిందని అంటున్నారు. సినిమా కోసం స్లిమ్ అయిన హెబ్బా ఇప్పటికే షూటింగ్‌లో జాయినైందని అంటున్నారు. కుమార్ ఎఫ్ 21తో మంచి ఇమేజ్ అందుకున్న హెబ్బా -గత ఏడాది 24 కిసెస్ చిత్రం చేసింది. ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో -ఆమెకు పెద్దగా అవకాశాలు లేకుండాపోయాయి. ‘భీష్మ’లోని పాత్ర -ఆమె కెరీర్‌కు ఎంత ఉపయోగపడుతుందో చూడాలి.