నేను బాగానే వున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనారోగ్యానికి గురైన మాట వాస్తవం. వైద్యులు ప్రాణం పోశారు. అయితే, డిశ్చార్జ్ అయిన తరువాత మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సోషల్ మీడియాలో వస్తోన్న కథనాల్లో వాస్తవం లేదు- అంటున్నాడు నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి బావుందని, మరోవారంలో షూటింగ్‌లకు కూడా హాజరవుతానని తెలిపారు. ఈమేరకు తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ‘నా ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో వచ్చిందని స్నేహితులు చెప్పారు. నిజమే.. ఆరోగ్యం బాగలేదు. కాకపోతే చచ్చిపోయేంత కాదు. వైద్యులు చికిత్సలు చేసి నన్ను బతికించారు. సో, నా అనారోగ్య పరిస్థితిపై వస్తోన్న ఎలాంటి కథనాలనూ నమ్మొద్దు. నా క్షేమాన్ని కాంక్షించిన వారందరికీ ధన్యవాదాలు అని వీడియోలో పేర్కొన్నారు.