హ్యాపీగా ఉంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తెరపై మంచి ప్రాజెక్టుతో లాంచ్ అయ్యానన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది అన్యాసింగ్. దర్శకుడు
కార్తీక్‌రాజు తెరకెక్కించిన ‘నిను వీడని నీడను నేనే’లో హీరో సందీప్‌కిషన్‌తో జోడీకట్టింది అన్యా. దయా పనె్నం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్
నిర్మించిన చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి టాక్ రావడంతో
-ఆ ఆనందంలో మీడియాతో
ముచ్చటించింది అన్యాసింగ్.

మాది ఢిల్లీ. అజ్మీర్ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నా. పొలిటికల్ సైన్స్, సోషియాలజీతో డిగ్రీ పూర్తి చేశా. కాలేజ్ డేస్‌లోనే వెడ్డింగ్ ప్లానర్‌గా వర్క్ చేశా. కాకపోతే, చిన్నప్పటినుంచే నటనపట్ల ఫ్యాషన్ ఉండటంతో చదువు తరువాత ముంబైకి షిఫ్టయ్యాను.
తెలుగులో తొలి చిత్రం నినువీడని నీడను నేనే. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎమోషనల్ సీన్స్ మనసుని కదిలించాయని ఆడియన్స్ చెబుతుంటే హ్యాపీగా ఉంది. రివ్యూస్‌లోను, క్రిటిక్స్‌నుంచి అప్లాజ్ వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు బావుండటంతో, థియేటర్లను పెంచుతున్నారు. ఐ యాం సో హ్యాపీ.
సినిమా విడుదలైన రోజు శుక్రవారం సాయంత్రం టీంతో కలిసి హైదరాబాద్‌లో మెట్రోలో జర్నీ చేశా. అప్పటికి సినిమా ఎక్కువ మంది చూశారో లేదోనని అనుకుంటున్న టైంలో -ట్రైన్‌లో సీన్స్ గురించి మాట్లాడుకుంటుంటే హ్యాపీ అనిపించింది. ఒక్క చిత్రమే చేశాను కనుక -నన్ను చాలామంది గుర్తు పట్టలేదు. సందీప్ చుట్టూ అభిమానులు చేరి సినిమా బావుందని చెబుతూ సెల్ఫీలు దిగుతుంటే భలే అనిపించింది.
నా తొలి హిందీ చిత్రం ‘ఖైదీ బ్యాండ్’. అందులో నా పెర్ఫార్మెన్స్ నచ్చి హీరో సందీప్, దర్శకుడు కార్తీక్ ఈ ప్రాజెక్టులో చాన్స్ ఇచ్చారు.
సందీప్ చెప్పినట్టు సినిమా టైంలో వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట నిజం. క్యాన్సర్ కారణంగా ఫాదర్ మరణించారు. నాన్న మరణంతో షాక్‌కి గురయ్యాను. తర్వాత నెమ్మదిగా కోలుకున్నా.
తెలుగు ఫస్ట్ సినిమాలో పెర్ఫార్మెన్స్‌కు చాన్స్‌వున్న పాత్ర దొరకడం నిజంగా లక్. హారర్ సీన్స్ చేసేటపుడు పెద్దగా కష్టం అనిపించలేదు. కానీ, ఎమోషనల్ సీన్స్‌లో ఆ పెయిన్ తెలిసింది. సినిమాలో -ఎక్కువ సేపు ఎమోషనల్ అండ్ కన్ఫ్యూజ్ క్యారెక్టర్‌గా కనిపిస్తా. చాలా సన్నివేశాల్లో ఏడుస్తూనే ఉంటా. పాత్ర తాలూకు భావోద్వేగాలను ఆడియన్స్‌కి కనెక్ట్ చేయడానికి కొంచెం కసరత్తు చేశా. ఆ ఫలితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా.
హారర్ సినిమాలంటే భయం ఉంది చూడ్డానికైనా, చేయడానికైనా. థ్రిల్లర్స్ ఇష్టం. హాలీవుడ్ మూవీ ‘సెవెన్’ ఇష్టమైన థ్రిల్లర్. ‘నిను వీడని నీడను నేనే’లో హారర్ సీన్ ఒక్కటే ఉంది. అది చేసేటప్పుడు చుట్టూ జనాలున్నారు. అయినా.. నైట్ షూట్ కారణంగా కొంచెం భయపడ్డాను. ఈ సినిమా థ్రిల్లరే అయినా, ఫాదర్ మదర్ ఎమోషన్ బావుంటుంది. కానె్సప్ట్ కూడా కొత్తది.
రియల్ లైఫ్‌లో నిజంగానే అద్దంలో మరొకరు కనిపిస్తే హార్ట్‌అటాక్ ఖాయం. అసలు ఆ ఊహకే పోలేను.
సందీప్‌తో వెరీ కంఫర్ట్. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. షూటింగ్ టైంలో డైలాగ్ అర్థంకాకపోతే వివరించి హెల్ప్ చేసేవాడు. సందీప్‌కి సినిమాలంటే పిచ్చి ప్రేమ. టాలెంటెడ్ యాక్టర్. కమిటెడ్ ఆర్టిస్ట్. సీన్ ఎలివేషన్ కోసం ఎంత కష్టానికైనా సిద్ధపడతాడు. దర్శకుడు కార్తీక్‌రాజ్ సైతం ఎంతో హెల్ప్ చేశాడు.
నేను సహజంగా నటించానంటూ ఆడియన్స్ నుంచి వస్తోన్న కాంప్లిమెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ అనిపిస్తోంది. నేచురల్ యాక్టర్ అనడం బాగుంది. కొంతమంది చేసిన నెగెటివ్ కామెంట్స్‌నీ పాజిటివ్‌గానే తీసుకుంటున్నా.
తెలుగులో మళ్లీ ఎప్పుడు? అన్నది ఇప్పుడే చెప్పలేను. కొంతమంది నిర్మాతలు అప్రోచ్ అవుతున్నారు. చర్చల దశలోనే ఉన్నాయి, ఏదీ ఫైనలైజ్ కాలేదు. హిందీలో యష్ రాజ్ ఫిలిమ్స్‌తో మూడు సినిమాల అగ్రిమెంట్ ఉంది. ఒక సినిమా చేశా. త్వరలో మిగతా రెండూ చేస్తా.
అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్ వచ్చిన తరువాత భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్ని సినిమాలూ చూస్తున్నారు. మంచి కథ, పాత్ర లభిస్తే నేను ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమే.