చిరు మైత్రి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. శ్రీమంతుడుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీస్ వరుస విజయాలతో టాలీవుడ్‌లోనే టాప్ బ్యానర్‌గా క్రేజ్ తెచ్చుకుంది. అయితే సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలతో డీలాపడ్డ బ్యానర్‌ను మళ్లీ లైన్‌లో పెట్టేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న మైత్రి.. ఆయనతోనే మరో సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. దాంతోపాటు అల్లు అర్జున్- సుకుమార్‌ల సినిమా లాక్ చేసింది. అలాగే రామ్‌చరణ్, ఎన్టీఆర్, సాయిధరమ్‌లతోపాటు మహేష్‌తో కమిట్‌మెంట్స్ ఉన్నాయి. తాజాగా మెగాస్టార్‌తో సినిమా చేయడం తమ డ్రీమ్ అని తెలిపాడు నిర్మాత. మెగాస్టార్ కోసం ఓ కథను సిద్ధం చేయించే పనిలో ఉన్నామని, త్వరలో కథా చర్చలు జరుపుతామని తెలిపారు. అయితే దర్శకుడు ఎవరన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. సైరాతో బిజీగావున్న చిరంజీవి, తరువాత కొరటాల శివతో 152వ సినిమాకు ఓకె చెప్పాడు. 153వ సినిమా మైత్రీ మూవీస్‌లో ఉంటుందన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.