తమ్ముడి జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొరసాని. లేటెస్ట్‌గా విడుదలైన సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా పరిచయమైన సినిమాలో ఇద్దరికీ మంచి మార్కులుపడ్డాయి. ముఖ్యంగా దొరసాని పాత్రలో శివాత్మిక నటన బాగుందంటూ ప్రశంసలందుతున్నాయి. ఇక ఆనంద్ కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో హీరోని అవ్వాలన్న ఆలోచన లేదన్న విషయాన్నీ దొరసానితో ప్రూవ్ చేశాడు. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఆయన న్యూడ్‌గా నటించి షాకిచ్చిన సంగతి తెలిసిందే. దొరసాని సక్సెస్‌తో అప్పుడే ఆనంద్ కోసం వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే రెండో సినిమా కన్ఫర్మ్ అయింది. కొత్త దర్శకుడితో ఆయన రెండో సినిమాకు అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయి. భవ్య క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుందట. నిజానికి ఈ కథను విజయ్ దేవరకొండ కోసం రాశారట. ఆ కథను ఇప్పుడు తమ్ముడితో తీయనున్నారు. అయితే రెండో సినిమాలో కాస్త కమర్షియల్ టచ్ ఇస్తూ పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తోపాటు ప్రీప్రొడక్షన్ పనులూ పూర్తికావొచ్చాయట. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోయిన్ అనే్వషణ పూర్తికాగానే, ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.