లైకా- శంకర్.. బడ్జెట్ డీల్ ఓకే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిగ్గజ దర్శకుడు శంకర్ రాజీ పడ్డాడు. ఆగిన భారతీయుడు మళ్లీ మొదలవుతోంది. ఈ తాజా సమాచారం. జాతీయ హీరో కమల్‌హాసన్ సేనాధిపతిగా లంచగొండులను చీల్చి చెండాడిన చిత్రం -్భరతీయుడు. పాతికేళ్ల క్రితం సెనే్సషన్ సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్ మొదలెట్టాడు శంకర్. సింపుల్‌గా సినిమాను ప్రారంభించి కొద్ది రోజులు షూటింగ్ సైతం జరిపారు. కాకపోతే -బడ్జెట్ విషయంలో నిర్మాత దర్శకుడి మధ్య లెక్కలు పొసగకపోవడంతో ఆగిపోయింది. నిర్మాణ సంస్థ లైకా బడ్జెట్ పరిమితుల్ని విధించటం ఏమాత్రం నచ్చని శంకర్ సినిమాను ఆపేశాడు. బడ్జెట్ పరిమితులు విధించని నిర్మాణ సంస్థతో భారతీయుడు -2 చిత్రాన్ని తెరకెక్కించేందుకు శంకర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరింత ఆలస్యం చేయడం మంచిది కాదని ఆలోచించిన శంకర్ -లైకా ప్రొడక్షన్స్ బడ్జెట్ పరిమితులకు లైక్ కొట్టినట్టు తెలుస్తోంది. అనుకున్న బడ్జెట్‌లోనే భారతీయుడు -2 చిత్రం తీసేందుకు ఆమోదం తెలపడంతో, షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు మూడోవారం నుంచి మళ్లీ షూటింగ్ మొదలుపెట్టే అవకాశం లేకపోలేదన్నది కోలీవుడ్ టాక్. భారతీయుడు 2లో కమల్‌తో కాజల్ జోడీ కట్టనుండటం తెలిసిందే.