డిస్కోరాజా తరువాత..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ చేస్తున్న తాజా ప్రాజెక్టు -డిస్కోరాజా. షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. దీని తర్వాత చేతిలోవున్న రెండు ప్రాజెక్టుల్లో ఒకదాన్ని వెంటనే లైన్లో పెట్టేందుకు రవితేజ సిద్ధపడుతున్నాడు. రెండింటిలో ఒకటి -గోపీచంద్ మలినేని ప్రాజెక్టు కాగా, రెండోది ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ‘మహాసముద్రం’. ఈ స్క్రిప్ట్‌మీద చాలారోజుల నుంచి వర్క్ చేస్తున్న అజయ్ భూపతి, రవితేజను సినిమాకు ఒప్పించాడని టాక్. డిస్కో రాజా తరువాత రవితేజ ‘మహా సముద్రం’నే మొదలుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. కథానాయకి పాత్రకోసం బాలీవుడ్ బ్యూటీ అదితిరావ్ హైదరిని సంప్రదిస్తున్నారని వినికిడి. ‘సమ్మోహనం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితి, తొలి ప్రయత్నంలోనే అభినయం, అందంతో విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రాజెక్టుకు ఆదితి ఒకే చెబితే, అది సినిమాకే ప్లస్సవుతుందని చెప్పొచ్చు.