తప్పదు మరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపం ఉడగానే ఇల్లు చక్కబెట్టాలన్న నానుడిని -తు.చ తప్పకుండా అమలు చేస్తోంది కన్నడ బ్యూటీ రష్మిక మండన్న. తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న రష్మిక -చలోతో అడుగుపెట్టి గీతగోవిందంతో క్రేజీ గాళ్‌గా ఎదిగిపోయింది. వెంటనే సూపర్‌స్టార్ మహేష్ సరసన హీరోయిన్‌గానూ ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రష్మికకు టాప్ డిమాండ్ ఉంది. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో రష్మిక రెమ్యూనరేషన్ పెంచేసిందన్న న్యూస్ వైరలవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీ అయిన రష్మిక, తాజాగా రెండోసారి విజయ్ దేవరకొండతో జోడీకట్టి ‘డియర్ కామ్రేడ్’ చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో రెమ్యూనరేషన్ కథనాలపై స్పందించిన రష్మిక -పారితోషికం పెంచడం సాధారణ విషయమే. కొనే్నళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. నటిగా నా ఎదుగుదలలో మార్పు ఉన్నప్పుడు.. అందులో పారితోషికమూ భాగమవుతుంది అంటూ కౌంటర్ వేసింది. అంటే -ఇల్లు చక్కబెడుతున్నానని చెప్పకనే చెబుతోందన్న మాట.