రేణు.. రీ ఎంట్రీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గత కొన్ని రోజులుగా మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి తెగ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మొత్తానికి ఆమె ప్రయత్నాలు ఫలించాయి.. తెలుగులో రేణుదేశాయ్ రీ ఎంట్రీ కన్ఫర్మ్‌చేసాడు ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్ర. అంతేకాదు ఆమె రీఎంట్రీ రచ్చరచ్చ ఉంటుందని చెబుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే రేణుదేశాయ్ రీఎంట్రీ ఇస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. అప్పట్లో గజదొంగగా ఆంధ్రా ప్రాంతంలో ఓ రేంజ్ భయభ్రాంతులకు గురిచేసిన ఆయన అంటే అప్పట్లో పోలీస్ వాళ్లకు హడల్. స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో ఓ సినిమా తెరకెక్కుతుంది. వంశీకృష్ణా ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. ఈ చిత్రంలో రేణుదేశాయ్ పాత్ర అందరికీ గుర్తుండిపోతుందని, ఈ సినిమాతో ఆమె క్రేజ్ రెట్టింపవుతుందని చెబుతున్నాడు రైటర్ సాయిమాధవ్ బుర్ర. ఈ సినిమాలో ఆర్‌ఎక్స్ 100 భామ ఓ ఐటెంసాంగ్ కూడా చేసింది. రానా హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో రేణు తెలుగులో ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.