‘గుణ 369’ నుంచి ‘బుజ్జిబంగారం’ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తికేయ, అనఘ జంటగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం -గుణ 369. అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మాతలు. చిత్రంలోని ‘బుజ్జి బంగారం..’ పాటను హాస్యనటులు బ్రహ్మానందం, అలీ విడుదల చేశారు. అలీ మాట్లాడుతూ చైతన్ భరద్వాజ్ స్వరపరచిన పాట బావుంది. దర్శకుడు అర్జున్ జంధ్యాల.. నేనూ కొలీగ్స్. ఇద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. బుల్లితెరపై సక్సెస్ అయన నిర్మాతలు సిల్వర్ స్క్రీన్‌పైనా సక్సెస్ కావాలి. ఈ సినిమా కార్తికేయకు ఆర్‌ఎక్స్100 కన్నా పెద్ద హిట్ కావాలి అన్నారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ -ప్రేమలో ఉన్న ప్రతి అమ్మాయి, అబ్బాయి పాడుకునేలా బుజ్జి బంగారం పాట ఉందన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -యధార్థగాథ మా చిత్రానికి ముడి సరుకైంది. స్క్రీన్‌మీద అంతే సహజంగా ప్రేక్షకుడి గుండెను తాకుతుంది అన్నారు. నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ -అందరిలోనూ పాజిటివ్ ఎనర్జీని నింపే ఇద్దరు లెజెండ్స్ పాటను విడుదల చేయడం హ్యాపీగా ఉందన్నారు.