కమల్ కాంప్లిమెంట్‌తో కన్నీళ్లొచ్చాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయోగాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు -చియాన్ విక్రమ్. తమిళంతోపాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ విక్రమ్ రేంజ్ వేరు. ‘శివపుత్రుడు’తో జాతీయ నటుడి అవార్డు అందుకున్న చియాన్ -అపరిచితుడుతో
అందనంత ఎత్తుకు ఎదిగాడు. చియాన్ తాజా ప్రాజెక్టు -మిస్టర్ కెకె. అక్షర హసన్, అభిహసన్ కీలక పాత్రల్లో రాజేష్ ఎం సెల్వ తెరకెక్కించిన చిత్రం. తమిళంలో రూపొందిన ‘కడరమ్ కొండాన్’ చిత్రం తెలుగులో మిస్టర్ కెకెగా టి నరేష్‌కుమార్, టి శ్రీ్ధర్‌లు విడుదల చేస్తున్నారు. 19న థియేటర్లకు వస్తున్న సందర్భంలో
మీడియాతో చియాన్ విక్రమ్ ముచ్చట్లు.

ఇంటర్నేషనల్ స్టైల్లో తెరకెక్కిన సినిమా -మిస్టర్ కెకె. కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ చేశా. అది పాజిటివా? నెగటివా? అని గెస్ చేయడం ఆడియన్‌కి థ్రిల్‌నిస్తుంది. గ్రే షేడ్స్‌తో ఉన్న పాత్ర -సినిమా చూస్తే అర్థమవుతుంది.
సినిమాకు కథే ముఖ్యం. అన్ని సమయాల్లో అది కుదరకపోవచ్చు. మంచి కథ ఉన్నప్పుడు గొప్ప పాత్ర ఉండకపోవచ్చు. కొన్ని సినిమాలకు క్యారెక్టర్ పేరే సినిమా టైటిల్ అవుతుంది. అంటే పాత్ర అంత గొప్పదన్న మాట. నేను ఇంగ్లీష్ తరహా సినిమా చేసి చాలా కాలమైంది. స్టైల్, ఫేజ్ చాలాకొత్తగా ఉంటుంది. యాక్షన్ రియల్‌గా ఉంటుంది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన గిల్ రియల్‌గా ఉండేలా ఫైట్స్‌ను తెరకెక్కించాడు. ఒకరోజులో జరిగే కథ కాబట్టి.. సినిమా ఫాస్ట్ ఫేజ్‌లో రన్నవుతుంది.
ఇంటర్నేషనల్ స్టైల్ అనగానే.. మన ఆడియెన్స్‌కు కనెక్టవుతుందా? నేటివిటీని మిస్సయ్యామా? అన్న భావన కలగొచ్చు. ఆ ఇబ్బందిలేకుండా ఎమోషన్స్ పార్ట్‌ని డిజైన్ చేశాం. నార్మల్‌గా డైలాగ్స్‌తోనే పెర్‌ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాం. అలాంటింది డైలాగ్స్ లేకుండా చేశానంటే, ఏదోక పార్ట్ ఆడియెన్స్‌కు కనెక్టవుతుందనే నమ్ముతాను.
శివపుత్రుడిని ఎవరూ రీమేక్ చేయలేదు. అంతకుముందెన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. శివపుత్రుడుని చేయకపోవడానికి కారణం, ఆ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాదేమోనన్న సందేహం. కానీ బాగా కనెక్ట్‌అయ్యింది. నేటివిటీని చూసే ఆడియెన్స్ సినిమాకు రాడు. ఎమోషన్‌కు కనెక్టవుతాడు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్’ నేటివిటీ మనదికాదు. కానీ ప్రేక్షకులు సినిమాను చూశారుగా. అలాగే బాహుబలీ అందరికీ కనెక్టైంది. అలా ఆడియన్స్‌కి బాగా కనెక్టయ్యే మంచి కథ, పాత్ర, ఫాస్ట్ ఫేజ్‌లో నడిచే సినిమా ఇది.
ప్రతి నటుడు డబ్బుకోసమో, ఏదో చేద్దాంలే! అనేలాకాకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తాడు. నా విషయానికొస్తే నాకు హిట్‌వచ్చిన ‘సేతు’ సినిమాకు ముందు 10-12 ఏళ్లనుండి సినిమాలు చేస్తున్నా. కానీ బ్రేక్ రాలేదు. కానీ ప్రతి సినిమా చేసే సమయంలో ఇది నాకు కచ్చితంగా బ్రేక్ ఇస్తుందని అనుకునే చేశాను. నటుడిగా నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకుడికి కనెక్టయ్యే సబ్జెక్ట్‌నే ఎంచుకుంటా.
ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. అలాగే నేను ఓ భాషలోనే సినిమాలు చేయాలనుకోలేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నాకు బ్రేక్‌నిచ్చిన సినిమాలున్నాయి. తెలుగులో నచ్చే స్క్రిప్ట్ వస్తే సినిమా చేస్తా.
దర్శకుడు రాజేష్ టెక్నికల్‌గా మంచి పరిజ్ఞానమున్న వ్యక్తికావడంతో తనకేం కావాలో పూర్తి అవగాహన ఉంది. కాబట్టి కంఫర్ట్ జోన్‌లో సినిమాను చేసేశాను.
సాధారణంగా కమల్ సార్ ఎవరి గురించి పెద్దగా మాట్లాడరు. కానీ ఈ సినిమా ఆడియో టైమ్‌లో నాగురించి, నేను నటించిన తీరు గురించీ మాట్లాడటంతో కళ్లు చెమర్చాయి. కమల్ అంటేనే ఒక శకం. ఈ సినిమాలో ఈ పాత్రను కమల్ చేయాల్సింది. కానీ రాజకీయాల్లో ఉండటంవల్ల చేయలేకపోయారు. నేను చేశాను.
మణి సర్‌తో సినిమా చేయడాన్ని నేను బాగా ఇష్టపడతాను. ఆయన మేకింగ్ డిఫరెంట్. ప్రతి సన్నివేశాన్నీ వివరించేటప్పుడు ఎలా వివరిస్తారా? అని ప్రక్కనే ఉండి అబ్జర్వ్ చేస్తుంటాను. ఆయన డైరెక్షన్‌లో పొన్నియన్ సెల్వన్ చేయబోతున్నాం. ఈ సినిమాలో నా పాత్రలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. రాజు పాత్రలో కనపడతాను. ఆ పాత్రకోసమే జుత్తు పెంచుతున్నా. పొన్నియన్ సెల్వన్‌గా జయం రవి నటిస్తాడేమో ఇంకా తెలీదు.
మా అబ్బాయి ధృవ్ అమెరికాలో మెథడ్ యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. ఈ పాత్రకు తను మరీ చిన్నోడు అవుతాడని తెలుసు. ఐదేళ్ల తర్వాత తనని యాక్టర్ చేయాలనుకున్నాను. కానీ నిర్మాత డబ్ స్మాష్ వీడియో ఏదో చూసి తనతో సినిమా చేయాలంటూ వచ్చి కలిశాడు. నేను ధృవ్‌కి ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు నేను చేయాలంటారా నాన్నా? అని అడిగాడు. చెయ్‌రా అంటే అలాగేనన్నాడు. తెలుగు సినిమా చూస్తావా? అంటే నువ్వు చెప్పావ్ కదా నాన్నా సినిమా చేస్తానని అన్నాడు. తను చాలా నేచురల్‌గా నటించాడు. కొన్ని సీన్స్‌లో నాకంటే బాగా నటించాడు. రొమాంటిక్ సీన్స్‌లో డిఫరెంట్‌గా నటించాడు. రొమాంటిక్ సీన్స్ చేసే సమయంలోనూ డబ్బింగ్ లోనూ బాగా చేశాడు.

-శ్రీనివాస్ ఆర్ రావ్