ఏ’ ఇస్మార్ట్ సెంటిమెంట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా చూసుకున్నా. నిర్మాతగానూ హ్యాపీగా ఉన్నా. సినిమా చూసిన తరువాత హీరో రామ్ ఇచ్చిన హగ్‌తో టెన్షన్లన్నీ పోయాయ్. ‘హైపర్ శంకర్’ గురించి ఇస్మార్ట్ పూరి డైలాగ్స్ ఇవి. ఇంత కాన్ఫిడెంట్‌కు కారణంపైనా పూరి ఓ హింటిచ్చాడు -‘శంకర్ సీక్వెల్‌కు ఫిక్సయ్యా. టైటిల్ రిజిస్టర్ చేయించా’నని. సీక్వెల్స్ చేసేది -బ్లాక్‌బస్టర్ చిత్రాలకేనన్న కామన్ కంటెంట్‌ను పరిగణనలోకి తీసుకుంటే -ఇస్మార్ట్ హిట్టుపై పూరి ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అంచనా వేయొచ్చు.
తెలంగాణ స్లాంగ్.. మాసీ రౌడీ స్టోరీ.. హీరో రామ్ ఎనర్జీ.. తెరని చించేసే అందాలు.. ఇవన్నీ కాన్ఫిడెంట్‌కు కొన్ని కారణాలైతే -పైకి కనిపించని మరో సెంటిమెంటూ వినిపిస్తోంది. అదే సెన్సార్ బోర్డ్ నుంచి తెచ్చుకున్న ‘ఏ’ సర్ట్ఫికెట్. ‘పెద్దలకు మాత్రమే’నన్న సెన్సార్ గుర్తింపుపట్ల చిత్రబృందం ఆనందంగా ఓ పోస్టర్నీ విడుదల చేయడం మరో విశేషం. నిజానికి సినిమా టాక్స్ స్లాట్‌లో ‘ఏ’కి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అంటే -నిర్మాతకు ఒకవిధంగా అదనపు భారమే. అందుకే కొన్ని కట్స్‌కు అంగీకరించి అయినా నిర్మాతలు ‘యు/ఏ’ సర్ట్ఫికేట్ కోసం ప్రయత్నిస్తారు. కాని అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదని నిర్మాతలు పూరి, చార్మి చెప్పటం వెనుక -ఇస్మార్ట్ విషయం ఉంది. పూరిలాంటి స్టార్ డైరెక్టర్ యు/ఏ సాధించటం పెద్ద కష్టమైన పనేం కాదు. కాకపోతే -యూత్‌ను టార్గెట్ చేస్తూ పూరి తెరపై పల్లపర్చిన ‘గ్లామర్’ డోస్ తగ్గించాల్సి ఉండొచ్చు. కథానుగుణంగా సృష్టించిన ‘టెంపర్ మాస్’ డైలాగులకి బీప్ పెట్టాల్సి రావొచ్చు. దీనివల్ల పూరి మైండ్‌లోని ‘ఇస్మార్ట్ శంకర్’ షేపే మారిపోవచ్చు. అందుకే సెన్సార్ విషయంలో ‘ఎ’లాంటి కాంప్రమైజేషన్‌కూ పూరి చాన్సివ్వలేదు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే -దేశముదురు, పోకిరి, బిజినెస్‌మేన్ చిత్రాలకూ సెన్సార్ ‘ఏ’ ఇచ్చింది. కాని చిత్రంగా ఆ చిత్రాల్ని బ్లాక్‌బస్టర్స్ చేసింది ‘అడల్ట్’కు అపోజిట్ వర్గాలే. ఈ సెంటిమెంట్‌తోనూ -ఇస్మార్ట్ శంకర్‌పై పూరి మోర్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాడని అర్థమవుతోంది. రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా రేపు థియేటర్లకు వస్తోంది. పూరి సెంటిమెంట్ స్కెచ్ వర్కవుటవ్వాలని ఆశిద్దాం.