అజిత్‌తో చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. గ్లామర్‌తోపాటు పెర్‌ఫార్‌మెన్స్‌కు స్కోప్ వున్న పాత్రలో నటిస్తూ టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఇటీవలే ‘ఊపిరి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమన్నా, తాజాగా తమిళంలో క్రేజీ అవకాశాన్ని కొట్టేసింది. ప్రముఖ తమిళ స్టార్ హీరో అజిత్ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. అజిత్ హీరోగా ‘వీరం’, ‘వేదాళం’ సినిమాలకు దర్శకత్వం వహించిన శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో ముందుగా అనుష్క, త్రిషలు నటిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఫైనల్‌గా ఇప్పుడీ అవకాశం తమన్నాకే దక్కింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ మొదటివారంలో ప్రారంభం కానున్నదట. అజిత్ సినిమా ఛాన్స్ దక్కడంతో తమన్నాకు మరిన్ని తమిళ అవకాశాలు క్యూ కట్టాయట.