అందుకే.. హ్యాపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటిగా నాపై నమ్మకంతోనే దర్శకులు వైవిధ్యమైన పాత్రలు సృష్టిస్తున్నారంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. తన కెరీర్‌లో ఇంతవరకూ చేయనటువంటి పాత్రను ‘సైరా’లో చేస్తున్నానంటూనే -ఆ సినిమాతో తనకు డబుల్ బొనాంజా దక్కినట్టేనన్న ఆనందం వ్యక్తం చేస్తోంది. చిరంజీవితో కలిసి నటించే అవకాశం రావడం ఒకటైతే, తాను అభిమానించే నయనతారతో కలిసి పనిచేయాల్సి రావడం మరొకటట. స్టార్ హీరోల సరసన చాన్స్‌లు లేకున్నా -తెలుగు, తమిళం, హిందీ.. ఇలా లెక్క తక్కువకాకుండా తమ్మూ సినిమాలు చేస్తూనేవుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే విడుదలైన నాలుగు చిత్రాలు గొప్ప విజయాలు అందుకోకున్నా -తమన్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తెలుగులో సైరా, దటీజ్ మహాలక్ష్మి చేస్తోంది మిల్కీ బేబీ. బాలీవుడ్‌లో చాన్స్ రావడంతో -టాలీవుడ్‌లో రాజుగారి గది 3ని వదిలేసుకోవడం తెలిసిందే. నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి ‘బోలే చుడియాన్’ చేస్తున్న తమ్మూ, ఈ సినిమాలో తన పాత్ర కెరీర్‌కు ఎంతో ఉపయుక్తమన్న భావనతో ఉంది. అటు తమిళంలో విశాల్‌తోనూ ఓ సినిమా చేస్తోంది. పల్లెటూరి యువతిగా మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తూ -యాక్షన్ సీన్స్ చేయనుందట.