ప్రచారానికి.. సాహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడతెరిపిలేని యాక్షన్ షూట్‌కు సెల్ఫీతో ఫుల్‌స్టాప్ పెట్టేశాడు -ప్రభాస్. అంటే -సాహోకు గుమ్మడికాయ కొట్టేశారు. యువీ క్రియేషన్స్‌పై దర్శకుడు సుజిత్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రంలో ప్రభాస్‌తో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకఫూర్ జోడీ కట్టింది. ప్రతినాయకుడిగా నీల్ నితిన్ ముఖేష్, ముఖ్యపాత్రల్ని బాలీవుడ్, తమిళ్, తెలుగు భాషల్లోని ప్రముఖులు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం సమకూర్చిన సినిమానుంచి ఇటీవలే విడుదలైన ‘సైకో సయ్యా’ లిరికల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 15న సినిమా థియేటర్లకు రానున్న నేపథ్యంలో -25 నెలలపాటు సాగించిన చిత్రీకరణను ముగించారు. ఈ సందర్భంగా టీం మొత్తం పార్టీ చేసుకుందట. పలువురు టెక్నీషియన్లతో ప్రభాస్ దిగిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భారీ బడ్జెట్ యాక్షన్ మూవీగా ప్రభాస్ అభిమానులను ఊరిస్తోన్న ‘సాహో’ -సెనే్సషన్ క్రియేట్ చేయగలదన్న అంచనాలు లేకపోలేదు. కొద్దిరోజుల క్రితం విడుదలైన లోడెడ్ యాక్షన్ ట్రైలరే -మార్కెట్ అంచనాలను పెంచేసింది.
ఇదిలావుంటే -సినిమాలో వచ్చే 8నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ హాలీవుడ్ చిత్రాల రేంజ్‌లో ఉండబోతోందన్నది చిత్రబృందం చెబుతోన్న తాజా మాట. సుమారు 70 కోట్ల బడ్జెట్‌తో డిజైన్ చేసిన కంటిన్యుయస్ యాక్షన్ ఎపిసోడ్ -ప్రభాస్ స్టామినాను చూపించనుందట. అబుదాబిలో షూట్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ -ప్రభాస్ స్టామినాను హాలీవుడ్ రేంజ్‌కి తీసుకెళ్లే ఉద్దేశంతోనే డిజైన్ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న సాహోలో ప్రభాస్ విభిన్న కోణాలున్న పాత్ర చేస్తుంటే, శ్రద్ధాకఫూర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. హిందీ, తెలుగు, తమిళంలో సమాంతరంగా విడుదలకానున్న సాహో -ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో, ఆడియన్స్‌కు ఎలాంటి వినోదాత్మక అనుభూతి అందిస్తుందో వెండితెరపైనే చూడాలి.