పూరి.. పోరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడ అందాలను అక్కున చేర్చుకోవడం టాలీవుడ్‌కు కొత్త కాదు. స్వర్ణయుగం కాలంలోనే కన్నడ అందాలు తెలుగు తెరపై కనువిందు చేశాయి. ఒక్కో సీజన్‌లో ఒక్కో కన్నడ బ్యూటీ -స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అయిన రోజులూ లేకపోలేదు. అలాంటి చాన్స్ సరికొత్త అందంగా మెరుస్తోన్న నభానటేష్‌కు దక్కుతుందేమో చూడాలి. దర్శకుడు పూరి ప్రాజెక్టులో పడటమే ఆమె కెరీర్‌కు ఓ టర్నింగ్ పాయింటన్న మాట వినిపిస్తోందిప్పుడు. పూరి సినిమాలో హీరోయిన్‌కు ఓ ప్రత్యేకత ఉంటుంది. పూరి ప్రాజెక్టుల్లో తళుక్కుమని ఓ రేంజ్‌కి ఎదిగిన హీరోయిన్లలో అనుష్కశెట్టి, ఆసిన్, రేణుదేశాయ్, రక్షిత, ఆయేషా టకియా, హన్సికా మోత్వానీ ఇలా చాలామందినే చెప్పుకోవచ్చు. ఆ జాబితాలో నభా పేరూ ఉంటుందేమో చూడాలి. పూరి తాజా ప్రాజెక్టు ఇస్మార్ట్ శంకర్‌లో రఫ్ అండ్ టఫ్ పాత్ర చేస్తోన్న నభా -ఈ పాత్ర తన కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందన్న నమ్మకంతో ఉంది. మరోపక్క తెలుగు స్క్రీన్‌పై తనకోస్థానాన్ని సంపాదించుకునే దిశగానే అడుగులేస్తోంది. అందం, ఆహార్యంలోనే కాదు భాషలోనూ తోటి హీరోయిన్లకంటే ఒకింత చురుకు చూపిస్తోంది నభా. ఇస్మార్ట్ శంకర్ బోనాలు ఈవెంట్‌లో తెలుగు మాటలతో మురిపించిన నభా -తెలుగు స్క్రీన్ కెరీర్‌పై ఫోకస్‌తో ఉన్నట్టు చెప్పకనే చెప్పింది. ఇస్మార్ట్ శంకర్ థియేటర్లకు రాకమునుపే -రవితేజ ‘డిస్కో రాజా’లో చోటు దక్కించుకుంది. వరుస ప్రాజెక్టులు దక్కించుకుంటున్న నభా -తెలుగు తెరపై కొత్త మెరుపనే అనుకోవాలి.