29న భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరణ్, రాజ్, సంపూర్ణేష్‌బాబు, హమీదా, రోషన్ ప్రధాన తారాగణంగా రాజేష్ పులి దర్శకత్వంలో మారుతీ టీమ్ వర్క్స్, శ్రీవెంకట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రూపొందుతోన్న భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలై మంచి హిట్ సాధించిన నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు మారుతి యూనిట్‌కు షీల్డులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ముగ్గురు షార్ట్ ఫిలిం చేసే యువకులు సంపూర్ణేష్‌బాబు హీరోగా ఓ సినిమా చేస్తే ఎలా వుంటుందనేదే ఈ సినిమా, పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్. సంపూర్ణేష్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడని, ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేస్తున్నామన్నారు. దర్శకుడు రాజేష్ పులి మాట్లాడుతూ, ఈ చిత్రంలో సంపూ గెటప్స్ అందరినీ అలరిస్తాయన్నారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ, ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కన్పిస్తానని, ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేసే సినిమా ఇదని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:జె.బి., కెమెరా:మల్హర్‌భట్, నిర్మాతలు:బోనం కృష్ణ సతీష్, అడ్డగార్ల జగన్‌బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ, దర్శకత్వం:రాజేష్ పులి.