భాష నేర్చాకే తెలుగు సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో స్ట్రెయట్ సినిమాలు చేయడానికి భాషపై తనకు పెద్దగా పట్టులేదంటోంది అక్షరహాసన్. తెలుగు సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయంటోంది అక్షర. తెలుగులో అవకాశాలు వస్తున్నాయని, అయతే భాష నేర్చుకున్నాక పూర్తి ఫోకస్ పెడతానంటోంది. జాతీయ నటుడు కమల్ కుమార్తెగా స్క్రీన్‌కు పరిచయమైన అక్షర -బాలీవుడ్‌లో షమితాబ్‌తో తనేంటో ప్రూవ్ చేసుకుంది. తాజాగా చియాన్ విక్రమ్, అభిహసన్‌తో కలిసి మిస్టర్ కెకె ప్రాజెక్టుతో మురిపించనున్న అక్షర -మీడియాకు చెప్పిన ముచ్చట్లు.
షమితాబ్ తర్వాత, మిస్టర్ కెకె డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇచ్చింది. ప్రెగ్నెంట్ పాత్రతో మెప్పించడానికి కృషిచేశాను. నటిగా ఎటువంటి పాత్రనైనా ఛాలెంజింగ్‌గా తీసుకోవాలన్నదే నా ఉద్దేశం.
విక్రమ్‌తో స్క్రీన్ షేరింగ్ చాలా హ్యాపీగా ఉంది. నిజంగా నా అదృష్టమిది. నన్ను మోటివేట్ చేసి చాలా హెల్ప్ చేశారు. ఆయన టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు.
మిస్టర్ కెకెలో నా పాత్ర పేరు అథిర. అభిహాసన్‌కి భార్యగా ప్రెగ్నెంట్ పాత్ర చేశా. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, సస్పెన్స్.
సొంత బ్యానర్‌లో చేయడం హ్యాపీనే. వర్క్ ఈజ్ వర్క్ కనుక -రెమ్యునరేషన్ తీసుకున్నా. లెజండరీ చిత్రాలు తీసిన బ్యానర్‌లో పని చేయడంతో నా అదృష్టం.
నటనకు సంబంధించి అమ్మ నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకున్నా. ఇంట్లో బాగా ప్రాక్టీసు చేసేదాన్ని. అలాగే స్నేహితులూ కొందరు హెల్ప్‌చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఛాలెంజింగ్ పాత్ర. బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియెన్స్.
నేను నా ఇష్టప్రకారమే సినిమాలు ఎంచుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు కూడా నేను సొంతంగా పాత్రలను ఎంచుకోవడానికే ఇష్టపడతారు.
దర్శకుడు సెల్వతో చేయడం చాలా మంచిగా అనిపించింది. తనకు కావాల్సిన కంటెంట్‌పై ఓ క్లారిటీతో ఉంటాడు. అలాగే నాకు హెల్ప్‌చేశారు.
బాలీవుడ్‌కు బహుశా హీరోయిన్‌లా కనిపించలేదేమో. లేదంటే నన్ను వేరే పాత్రల్లో చూడాలనుకుంటున్నారో. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన కదా. మరి వాళ్ళ మనసులో ఏముందో..
నాకు దర్శకత్వం అంటే చాలా ఇష్టం. రెండు మూడు కథలు విన్నాను. మా ఫాదర్ ఒప్పుకుంటే మా బ్యానర్‌లో చేస్తా.ృల