మిషన్ సక్సెస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు జగన్‌శక్తి తెరకెక్కించిన సైన్స్ సినిమా -మిషన్ మంగళ్. 2013లో భారత్ చేపట్టిన ‘మంగళ్‌యాన్’ మిషన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికరమైన ట్రైలర్ విడుదలైంది. ‘పరిశోధనలు లేనిదే సైన్స్ లేదు. పరిశోధనలు చేయకుండా మనకి మనం శాస్తవ్రేత్తలం అని చెప్పుకోలేం’ అంటూ అక్షయ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో శాస్తవ్రేత్త రాకేష్ ధావన్ పాత్రను అక్షయ్‌కుమార్, తారాషిండే పాత్రను విద్యాబాలన్ పోషించినట్టు ట్రైలర్‌లో చూపించారు. మంగళ్‌యాన్ ఉపగ్రహాన్ని అంగారకుడిపైకి పంపించాలని శాస్తవ్రేత్త రాకేష్ ప్రతిపాదించటం, ఇస్రోలో ఎవరికి అనుభవం ఉందంటూ శాస్తవ్రేత్తల మధ్య చర్చ, మంగళ్‌యాన్‌ను మార్స్‌పైకి పంపితీరాలన్న శాస్తవ్రేత్తల సంకల్పం.. ఇవన్నీ ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. భారతీయ శాస్తవ్రేత్తలు చరిత్రలో నిలిచిపోయే ఓ అద్భుత ఘట్టాన్ని ఎలా ఆవిష్కరించారన్నదే ‘మంగళ్‌యాన్’ ఇతివృత్తం. ఆగస్టు 15న సినిమా థియేటర్లకు వస్తోంది.