కిల్లర్ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంతకుడిని పట్టుకోడానికి ఇనె్వస్టిగేషన్ మొదలెట్టాడు -రాక్షసుడు. ‘మనం ఊహించిన దానికంటే ఈ కేసులో ఏదో సీరియస్‌నెస్ ఉంది’ అన్న డైలాగ్‌తో ఆసక్తిని రేకెత్తించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అనుపమ పరమేశ్వరన్‌తో జోడీకట్టి బెల్లంకొండ చేస్తున్న తాజా చిత్రం -రాక్షసుడు. రమేష్ వర్మ తెరకెక్కించిన చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూర్చాడు. ఆగస్టు 2న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను వదిలింది చిత్రబృందం. ‘నేనంటే భయానికే భయం. నా గురించి వెతకొద్దు’ అంటూ ఓ సీరియల్ కిల్లర్, హీరోకిచ్చిన వార్నింగ్ డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ఉత్కంఠ రేకెత్తించింది. హంతకుడు ఎవరు? హత్యలెందుకు చేస్తున్నాడు? హంతకుడి కోసం సాగే పోలీస్ ఇనె్వస్టిగేషన్? వాడ్ని పట్టుకునే ప్రయత్నంలో హీరోకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కథలో ముఖ్య భాగమైన ఈ అంశాలను కవర్ చేస్తూ ట్రైలర్‌ను చూపించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.