ఇదే మాస్ పవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మాస్ పవర్’. ఈ చిత్రం 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఫిలిం ఛాంబర్‌లో వేడుక నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా సీనియర్ దర్శకులు సాగర్, ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ యూనిట్‌కు యాభై రోజుల షీల్డ్స్ అందజేశారు. అనంతరం దర్శకులు సాగర్ మాట్లాడుతూ పెద్ద సినిమాలే యాభై రోజులు ఆడటం గగనమవుతోన్న రోజుల్లో చిన్న సినిమా యాభై రోజుల వేడుక జరుపుకోవడం గొప్ప విషయం. ‘మాస్ పవర్’అంటే ఏంటో మరోసారి సినిమా నిరూపించిందన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ఏదైనా చేయగల సమర్థుడు శివ జొన్నలగడ్డ. సినిమా తీయడం, విడదల చేయడం కష్టతరమవుతోన్న ఈరోజుల్లో యాభై రోజుల వేడుకకు సినిమా రావడం చిన్న విషయం కాదు. శివ తదుపరి సినిమాలు కూడా ఈ స్థాయిలోనే ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు, హీరో శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘నేను గతంలో చేసిన ‘పోలీస్ పవర్’ చిత్రం తర్వాత ‘మాస్‌పవర్’ చిత్రాన్ని కూడా 50 రోజులు ఆడించిన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా విజయానికి డిస్ట్రిబ్యూటర్లే కారణం. చిత్ర యూనిట్ సహాయ సహకారాలు కూడా మరువలేనివి. తదుపరి చిత్రంగా ‘సూపర్ పవర్’ నిర్మిస్తున్నా. ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు.