ముద్దుగా వద్దంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిలువెత్తు సంప్రదాయానికి నేత చీర కట్టినంత హాయిగా ఉంటుంది సాయిపల్లవి. అలనాటి తారల్ని రీమేక్ చేసినంద అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తోంది. అందుకే -రెండక్షరాల 'ఫిదా’తో రెండిందాలా ఇమేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్‌లో సాయిపల్లవిది సెపరేట్ క్రేజ్. అందరి హీరోయిన్లులా ఆమెను చూడలేం. స్క్రీన్‌పై ‘ముద్దు’ ఎప్పుడో సిగ్గొదిలేసినా -తన హద్దులు తనకు తెలుసంటోంది సాయిపల్లవి. అందుకే -చుంబన సన్నివేశముందన్న కారణంగా సినిమానే వదిలేసుకుందట. అదీ క్రేజీ కామ్రేడ్ దేవరకొండతో. వివరాల్లోకి వెళ్తే -హీరో విజయ్ దేవరకొండ హీరోగా భరత్‌కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ ప్రాజెక్టు కోసం ముందుగా సాయిపల్లవినే అప్రోచ్ అయ్యారట. అయితే ‘లిప్ లాక్స్’ సన్నివేశాలు వచ్చేసరికి -కథకు దూరమైపోయిందట సాయిపల్లవి. బాగా నచ్చిన కథే అయినా -ముద్దును మితిమీరటం ఇష్టంలేక సినిమాను వదిలేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. సాయిపల్లవి పెర్ఫార్మెన్స్‌పై నమ్మకమున్నా -ముద్దును సెటిమెంట్‌గా ఫీలవుతున్న విజయ్ దేవరకొండ సన్నివేశాన్ని మార్చమని అడగలేడు. విజయ్ సెంటిమెంట్‌ను మేకర్స్ కూడా ఫీలవుతుండటంతో -సన్నివేశానికో ముద్దుకైనా అభ్యంతరాలు లేవనే పరిస్థితి కనిపిస్తోంది. నియమాన్ని వదులుకోలేని సాయిపల్లవి మాత్రం సినిమానే వదిలేసుకుంది. ఆ చాన్స్ రష్మికకు దక్కింది. డియర్ కామ్రేడ్ చేసిన ‘లిప్ లాక్’ క్లాసిగ్గా ఉంటుందో, కసిగా ఉంటుందో సిల్వర్ స్క్రీన్‌పైనే చూడాలి.