కన్నడ సినిమాలో నటిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘సరైనోడు’ చిత్రంలో నటిస్తున్న అల్లు అర్జున్ తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోగా తనదైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ వుంది. ఇప్పటికే మలయాళంలో బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఆయన సినిమాలకు అక్కడ యమ క్రేజ్ ఉంది. తాజాగా తన ‘సరైనోడు’ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా బెంగుళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్, మంచి కథ వస్తే కన్నడంలో కూడా నటిస్తానని, రాజ్‌కుమార్ ఫ్యామిలీతో కూడా సినిమాలు చేయాలని ఉంది అని అన్నారు. మొత్తానికి అల్లు అర్జున్ సౌత్‌లో పాపులర్ అవ్వాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.