రొమాంటిక్.. ఉత్తర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామ్, కారుణ్య కత్రేన్‌ను జోడీగా చూపిస్తూ దర్శకుడు తిరుపతి యస్‌ఆర్ తెరకెక్కిస్తోన్న చిత్రం -ఉత్తర. లైవ్ ఇన్ సి, గంగోత్రి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమ్మారెడ్డి భరద్వాజ, రాజ్ కందుకూరి చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది. రొమాంటిక్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటోంది. ట్రైలర్‌లోనే బ్యాక్‌డ్రాప్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్నారని, సంగీత దర్శకుడు సురేష్ సినిమా ఆత్మను సంగీతంలో చూపించాడని తమ్మారెడ్డి కితాబునిచ్చారు. లుక్ అండ్ ఫీల్ మూవీ ఉత్తరతో దర్శకుడు తిరుపతికి మంచి విజయం సిద్ధించాలన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ -ప్రతిభ ఉన్నవాళ్లకు పరిశ్రమలో ఎప్పుడూ స్థానముంటుందని అంటూ, సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాత శ్రీపతి గంగదాస్ మాట్లాడుతూ -సినిమా బాగా రావడానికి కారణం టెక్నీషియన్లు, ఆర్టిస్టులే. సినిమాను తిరుపతి తెరకెక్కించిన విధానం సూపర్బ్. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నాం అన్నారు. దర్శకుడు తిరుపతి మాట్లాడుతూ -సినిమాలో పాత్రలు సహజంగా వుంటాయి. ప్రతి సన్నివేశంతో ప్రేక్షకులు కనెక్టవుతారు అన్నాడు.