సిరివెనె్నల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియమణి ప్రధాన పాత్రలో వస్తున్న హారర్ థ్రిల్లర్ -సిరివెనె్నల. దర్శకుడు ప్రకాష్ పులిజాల తెరకెక్కిస్తున్న చిత్రాన్ని ఏఎన్ బాషా, రామసీత నిర్మిస్తున్నారు. మహానటి ఫేమ్ సాయి తేజస్విని, బాహుబలి ఫేమ్ కాలకేయ ప్రభాకర్, అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా సినిమా ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ -సినిమా రంగంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన భాషా నిర్మాతగా తొలి ప్రయత్నం ఈ సినిమా. సినిమా విజయం సాధించాలని, టీం అందరికీ మంచి భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. ఆర్‌పి పట్నాయక్ మాట్లాడుతూ -మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి నిర్మాతగా మారుతోన్న భాషా ఈ సినిమాతో పెద్ద హిట్టందుకోవాలని ఆకాంక్షించారు. దర్శకుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ -సినిమా ప్రపంచానికి సురపరిచితుడైన భాషాకు మంచి భవిష్యత్ ఉండాలని ఆశీర్వదించారు. సాయి తేజస్విని, ప్రియమణి పెర్ఫార్మెన్స్‌ను ప్రశంసించారు. ప్రియమణి మాట్లాడుతూ -సిరివెనె్నల చిత్రంతో నా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలైనట్టే. కథ నచ్చటంతో ఈ సినిమా చేశానని, మంచి అవకాశం కల్పించిన దర్శకుడు ఓంప్రకాష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు ఓంప్రకాష్ మాట్లాడుతూ -నా రెండో చిత్రాన్ని జాతీయ అవార్డు తీసుకున్న నటితో చేయడం హ్యాపీగా ఉంది. సినిమా చేద్దాం ఏదైనా కథ ఉంటే చెప్పమని భాషా అడిగినపుడు ఈ కథ చెప్పాను. వెంటనే అంగీకరించి సినిమాను చకచకా సెట్‌చేశారన్నారు. నిర్మాత భాషా, కమల్ బోరా మాట్లాడుతూ -సినిమా బాగా వచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం అన్నారు. కార్యక్రమంలో ఎంఎం కీరవాణి, రాజేంద్రప్రసాద్ తదితరులు ఆసక్తికరమైన సినిమాను చూసి ఎంజాయ్ చేయాలంటూ, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.