నమ్మకం వమ్ముకాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ మంచి సినిమాతో సక్సెస్ అందుకోవాలన్న మా నమ్మకం వమ్ముకాలేదు అంటున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. గత 12న విడుదలైన నిను వీడని నీడను నేనే చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కడంతో -హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ థాంక్స్‌మీట్‌లో ఉద్వేగంగా మాట్లాడాడు. సందీప్ కష్టాన్ని దేవుడు గుర్తించాడని, నిను వీడని నీడను నేనే సినిమా హిట్టుతో ఆ విషయం రుజువైందని అన్నాడు సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్. సందీప్, ఆన్యసింగ్ జోడీగా దర్శకుడు కార్తీక్‌రాజు తెరకెక్కించిన సినిమా థాంక్స్‌మీట్‌లో తమన్ మాట్లాడుతూ అన్ని సినిమాలనూ కమర్షియల్‌గా ఆలోచించలేం. కొన్ని సందర్భాల్లో మనుషులు ముఖ్యమని అనిపిస్తుంటుంది. ఈ సినిమా విషయంలో స్నేహితుడు సందీప్ ముఖ్యం నాకు. అందుకే ఈ సినిమా చేశా. సందీప్ కష్టాన్ని దేవుడు గుర్తించి హిట్టిచ్చాడు అన్నారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ -ఇదేదో సూపర్‌హిట్, బ్లాక్‌బస్టర్ అని నేను చెప్పుకోను. నాకొచ్చిన ఫీడ్‌బ్యాక్‌బట్టి నిజాయితీ చెబుతున్నా. మంచి హిట్ పడింది. ఈ ఫీడ్‌బ్యాక్ ఎక్కడో గదిలో కూర్చుంటే వచ్చింది కాదు. ప్రమోషన్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నపుడు -అభిమానులు ఎదురొచ్చి మరీ చెప్పిన విషయం. ఈ టూర్‌లో కళ్లు చెమర్చే ఫీడ్‌బ్యాక్ సైతం వచ్చింది. ఫలానా సన్నివేశం బావుందని, ముఖ్యంగా క్లైమాక్స్‌లో మదర్ సెంటిమెంట్‌తో భావోద్వేగానికి గురయ్యామని చెబుతుంటే హ్యాపీ అనిపించింది. భారీ లాభాల కోసం చేసిన సినిమా కాదు. మాలో ఆత్మవిశ్వాసం పెంచుకోడానికి చేసిన చిత్రమిది. ఫలితం అందింది అన్నాడు. నిర్మాత దయాపనె్నం మాట్లాడుతూ ‘నిర్మాతగా నాకిది గుడ్ స్టార్ట్. తొలి సినిమానే ఆదరించి ఉత్సాహం నింపారు. ఈ టీంలో కొందరు లేకపోతే అసలు సినిమానే లేదు. అలా రేయింబవళ్లు కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు. కార్యక్రమంలో నిర్మాత సుప్రియ, హీరోయిన్ అన్యసింగ్ తదితరులు మాట్లాడారు.