సాహో.. క్వాలిటీ కహానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి తరువాత బాక్సాఫీస్ ఆసక్తిగా గమనిస్తున్న చిత్రం -సాహో. థియేటర్లకు ప్రభాస్ ఎప్పుడొస్తాడా? అంటూ ఫ్యాన్స్ సైతం ఎదురు చూస్తున్నారు. అయితే, సాహో విడుదల వాయిదా, తదుపరి డేట్‌పై చిన్న కన్ఫ్యూజన్ కొనసాగిన నేపథ్యంలో చిత్రబృందం కొత్త డేట్‌ను కన్ఫర్మ్ చేసింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఆడియన్స్‌కు సినిమా అందించే ఉద్దేశంతోనే రిలీజ్ డేట్‌ను మార్చుకున్నట్టు చిత్రబృందం చెప్పడం తెలిసిందే. సినిమాకు సంబంధించి టెక్నికల్ వర్క్‌ను పూర్తి చేసే పనిలో నిమగ్నమైన నిర్మాతలు -ఆగస్టు 30న ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను థియేటర్లకు తెస్తామనే చెబుతున్నారు. ‘మా బ్యానర్‌లో వచ్చిన సినిమాలన్నీ క్వాలిటీగా ఉన్నవే. ఇండియన్ సినిమాకు ల్యాండ్‌మార్క్‌లాంటి సాహో విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ద బెస్ట్ అవుట్‌పుట్ ఆడియన్స్‌కి అందించే ఉద్దేశంతోనే విడుదల తేదీని మార్చుకోవాల్సి వచ్చింది’ అని నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు చెబుతున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన సినిమా తెలుగు, తమిళ, హిందీల్లో ఒకేసారి విడుదల కానుంది.