కుర్ర హీరోతో...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ శ్రీయ.. మళ్ళీ సినిమాల్లో బిజీగా మారేందుకు చక్కటి ప్రణాళికలు వేసుకుంటోంది. దాదాపు దశాబ్దకాలం పైగా సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న భామకు అవకాశాలు తగ్గడంతో గత ఏడాది ఆండ్రీ కోషెన్ అనే విదేశీయుడిని పెళ్లిచేసుకుని సినిమాలకు దూరమైంది. తరువాత రీఎంట్రీ ఇచ్చి తమిళంలో సినిమా చేసింది. ఇటు తెలుగులో బాలకృష్ణ సరసన ఓ సినిమాలో ఎంపికైందంటూ వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు హిందీలో తడ్కా అంటూ, తమిళంలో నాగసూరన్ సినిమాల్లో నటిస్తున్న శ్రీయ మరో క్రేజీ చాన్స్ అందుకుంది. అదీ కుర్ర హీరో పక్కన హీరోయిన్‌గా. ఏంటి.. కుర్ర హీరోతో శ్రీయా...జోడిగానా...అంటూ షాక్ అవుతున్నారా? కుర్ర హీరో విమల్‌కు జోడిగా నటించేందుకు శ్రీయ ఓకే చెప్పిందట. సందకారి... ది బాస్ అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కనుంది. మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న ది బాస్ సినిమాకు ఇది రీమేక్. ఆర్ మాదేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలైంది. యాక్షన్, కామెడీ, డ్రామా, రొమాన్స్ అన్ని అంశాలతో సినిమా ఉంటుందని టాక్. ప్రస్తుతం కేరళలో షూటింగ్ మొదలుపెట్టిన టీమ్ తదుపరి షెడ్యూల్‌ని గోవాలో ప్లాన్ చేశారట. ఇనే్నళ్లయనా ఇంకా తనలో గ్లామర్ తగ్గలేదని ప్రూవ్ చేసుకుంటున్న శ్రీయ కుర్ర హీరోలతో హీరోయిన్‌గా రెడీ అంటుంది. మరి శ్రీయ ఈ రేంజ్‌లో గ్లామర్ మెయన్‌టెన్ చేస్తే... కుర్ర భామలకు గట్టి పోటీ తప్పదేమో!!