ఇప్పుడు మహేష్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జవాను కథలు తెలుగు జనానికి కొత్తకాదు. అలనాటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ నుంచి ఈనాటి స్టార్ హీరోల వరకూ -డిఫెన్స్ డ్రెస్ వేసుకుని మురిపించినోళ్లే. జవాన్ అనగానే -స్ట్ఫినెస్, సిన్సియారిటీ ఈ రెండే ఠక్కున మనోఫలకంపై ప్రత్యక్షమవుతాయి. అలాంటి పాత్రను మహేష్ చేస్తున్నాడన్నపుడే -ఒకింత ఆసక్తి కనిపించింది. మహేష్ తాజా ప్రాజెక్టుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం -సరిలేరు నీకెవ్వరు. సోల్జర్ కథను చెబుతున్నానంటూనే -సింపుల్ టైటిల్ పెట్టి ఇదో ఎంటర్‌టైనర్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. ఫస్ట్ షెడ్యూల్‌ను కాశ్మీర్‌లో మొదలెట్టి ఏకబిగిన సాగించిన చిత్రబృందం -సెకెండ్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేసింది. ఇటీవలే కాశ్మీర్ షూటింగ్‌లోని ఓ ఫొటో లీకైంది కూడా. అయితే, తాజాగా మహేష్ ఫొటోను చిత్రబృందం సైతం విడుదల చేసింది. కాశ్మీర్‌లోని కీలక ప్రాంతాల్లో షూటింగ్ జరిపామని, మహేష్‌తోపాటు ముఖ్య తారాగణం పాల్గొన్నట్టు దర్శకుడు కన్ఫర్మ్ చేశాడు. రెండో షెడ్యూల్ -26నుంచి హైదరాబాద్‌లో మొదలవుతుందట. దీనికోసం భారీ సెట్స్ వేస్తున్నట్టు టాక్. ఓ రైల్వే స్టేషన్ సెట్‌తోపాటు, రెండు భారీ హౌస్ సెట్స్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. యంగ్ టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా వరుస హిట్లతో టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతోన్న రష్మిక మండన్న -మహేష్‌తో ఈ ప్రాజెక్టులో జోడీ కడుతోంది. వచ్చే సంక్రాంతికి టార్గెట్ చేసుకుని సిద్ధమవుతోన్న చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన ఆనందంలో దర్శకుడు అనిల్ -‘మహేష్‌తో పని చేయటం హ్యాపీ అనిపించింది. మహేష్ అద్భుతమైన నటుడు’ అంటూ ట్వీట్ చేశాడు. భారీ హిట్టని పైకి చెప్పుకుంటున్నా ‘మహర్షి’ ఫలితంతో సంతృప్తిపడని మహేష్ -పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.