మర్డర్ మిస్టరీతో.. 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హత్యోదంతం మాటునున్న మిస్టరీని చేధించే నేపథ్యంగా యాక్షన్ ఎంటర్‌టైనర్ ఒకటి మొదలైంది. రూపేష్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరో హీరోయిన్లుగా కొత్త దర్శకుడు శివకుమార్ బి తెరకెక్కిస్తోన్న ఆ సినిమా -22. రామానాయుడు స్టూడియోస్‌లో లాంచనంగా ప్రారంభమైన సినిమాకు సీనియర్ హీరో వెంకటేష్ క్లాప్‌కొట్టారు. నిర్మాతలు బీవీఎస్‌ఎన్ ప్రసాద్, నవీన్ ఎర్నేని, కొండా కృష్ణంరాజు సంయుక్తంగా కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహూర్తపు షాట్‌కు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహిస్తే, దర్శకుడు హరీష్ శంకర్ చిత్ర దర్శకుడు శివకుమార్‌కి స్క్రిప్ట్ అందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పూజా కార్యక్రమాలను దర్శకుడు కెఎస్ రవీంద్ర నిర్వహించారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు శివకుమార్ మాట్లాడుతూ -వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ తొలి సినిమాకు ఆశీర్వాదాలు అందించిన పెద్దలకు ధన్యవాదాలు. మారుతి, పూరి జగన్నాథ్, వివి వినాయక్ వద్ద సంపాదించిన అనుభవంతో దర్శకుడిగా తొలి అడుగు వేస్తున్నా. ప్రొడక్షన్ హెడ్ అనీలామా ద్వారా నిర్మాత సుశీలాదేవికి చెప్పిన కథ నచ్చటంతో ప్రాజెక్టు మొదలైంది. హీరోయిన్ సలోని మిశ్రా పూరీ కనెక్ట్స్ నుంచి వచ్చింది. అడిగిన వెంటనే డేట్స్ అడ్జెస్ట్ చేసిన పూరి, చార్మికి థాంక్స్. బిగ్‌బాస్ ఫేం పూజా రామచంద్రన్ కీలక పాత్ర పోషిస్తోంది. సాయికార్తీక్ సంగీతం, జాషువా యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ చిత్రానికి హైలెట్స్. సినిమా టైటిల్ 22 ఓ నెంబర్. ఆ నెంబర్ వెనకున్న కీ ట్విస్ట్ మీదే సినిమా నడుస్తుంది. 29నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అన్నారు. హీరో రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ -ఆర్టిస్ట్ కావాలన్న కోరిక నెరవేరడమే కాదు, ఆ ప్రాజెక్టుకు వెంకటేష్ క్లాప్ నివ్వడం థ్రిల్లింగ్‌గా ఉంది. శివ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నపుడు విన్న కథ ఇది. కథ కోసం శిక్షణ తీసుకున్నా. మంచి టీం కూడా కుదరడంతో ప్రాజెక్టు ఇలా మొదలైంది’ అన్నాడు. హీరోయిన్ సలోని మిశ్రా మాట్లాడుతూ -పెద్ద ప్రాజెక్టులో భాగమైనందుకు హ్యాపీగా ఉంది. ట్విస్ట్ అండ్ టర్న్‌లతో అందరికీ కనెక్టయ్యే స్టోరీ ఇది అన్నారు. కార్యక్రమంలో ప్రొడక్షన్ హెడ్ అనీ లామా, నటి పూజా రామచంద్రన్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సుప్రీం హీరో సాయితేజ్ హాజరైతే, సి అశ్వినీదత్, కెఎస్ రామారావు, యంఎస్ రాజు, అనీల్ సుంకర, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, ఎస్‌వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కెకె రాధామోహన్, సముద్ర, నిమ్మకాయల ప్రసాద్, చిట్టూరి శ్రీనివాస రావు, సాగర్ తదితరులు దర్శక నిర్మాతలు, చిత్ర యూనిట్‌ని ఆశీర్వదించారు.