ముద్దు ఓ ఎమోషన్.. సక్సెస్ సూత్రం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం కిస్ సీన్స్‌తోనే సక్సెస్ రాదు అంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్‌రెడ్డితో రౌడీ హీరోగా సెనే్సషన్ క్రియేట్ చేశాడు విజయ్. ఆ సెనే్సషన్ టాలీవుడ్‌లోనే కాదు, సౌత్‌లోనే ఓ క్రేజ్ క్రియేట్ చేసింది. తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం -డియర్ కామ్రేడ్. భరత్‌కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించిన సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 26న థియేటర్లకు వస్తోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ

ప్రమోషన్‌కోసం కొత్త స్ట్రాటజీ...?
డియర్ కామ్రేడ్ నాకు బాగానచ్చింది. దీన్ని మనమే ప్రమోట్ చేసుకోవాలని ఆలోచించి... ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాం. తెలుగులో మాత్రమే కాదు కదా.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాం. అన్ని భాషల ప్రమోషన్లలో పాల్గొనాలి. అక్కడకు వెళ్లి రొటీన్‌గా ఏదో మాట్లాడితే నాకే బోర్ కొడుతుంది. పైగా అక్కడికొచ్చిన ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతారని అనిపించి.. మ్యూజిక్ ఈవెంట్‌గా మార్చాం.
నాలుగు భాషల్లో విడుదల. టెన్షన్‌గా ఉందా?
అలాంటిదేమీ లేదు. కారణం -సినిమాపై నమ్మకంగా ఉన్నాం. ఈ కథ ఎక్కడైనా వర్కవుట్ అవుతుంది కాబట్టే టెన్షన్ లేదు. పైగా మన సినిమా ఇన్ని భాషల్లో విడుదలవుతుండటం అంటే గ్రేట్ కదా. పైగా ఇప్పటివరకు ఓ తెలుగు సినిమా సౌత్‌లోని అన్ని భాషల్లో విడుదలైన దాఖలా లేదు. బాహుబలి సినిమా కన్నడలో తెలుగే విడుదల చేశారు. అలాగని సినిమాను పోల్చటం లేదు.
ఊహించని స్టార్ ఇమేజ్? ఫీలింగ్?
ఇమేజ్ అన్నది ప్రేక్షకుల వైపునుంచి వచ్చే ఇమాజినేషన్. నావరకు మాత్రం విజయ్ అంటే ఇలా ఉంటాడు, అంతే. ఇమేజ్ అన్నదాన్ని చూసుకుని ఎగిరిపడితే దాని ఫలితం ఇంకోలా ఉంటుంది. అందుకే ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోను. కానీ బాధ్యతగా తీసుకుంటా. నావరకు నాపని ఇది. ఇది తప్పకుండా చేయాలంటే అది చేస్తా. కానీ బాధ్యత అప్పుడే ఎందుకు? అని అప్పుడప్పుడు మరిచిపోతా.
డియర్ కామ్రేడ్ కథ గురించి?
ఇది బాబీ అని ఓ స్టూడెంట్ లీడర్ జర్నీ. దాంతోపాటు లిల్లీ అనే అమ్మాయి ప్రయాణం. వీరిద్దరి ప్రయాణం ఎక్కడ ఎలా కలిసింది, వారి జీవితంలో వచ్చిన సమస్యలేమిటి అన్నది కథ. మంచి ఎమోషనల్ ట్రీట్. సినిమా చూసాక తప్పకుండా ప్రేక్షకుడు ఆ ఎమోషన్‌ను ఇంటిదాకా తీసుకెళ్తాడు.
టైటిల్ జస్ట్ఫికేషన్?
‘డియర్ కామ్రేడ్’ అంటే.. మనకు ఇష్టమైన వాళ్లను మనం డియర్ అని పిలుస్తాం. అలాగే కామ్రేడ్ అంటే మనం సాధించుకోవాల్సిన హక్కుల గురించి పోరాడటం. అలాగని ఇందులో రాజకీయాలు, కమ్యూనిజం లాంటివి ఏమీ ఉండదు.
మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఇందులో నా పేరు బాబీ. అతని తాత కమ్యూనిస్ట్ నాయకుడు. కాబట్టి చిన్నప్పటినుండి ఇంట్లో విప్లవభావాలు ఎక్కువ. అన్యాయాన్ని సహించకపోవడం, తప్పులను ఎత్తిచూపడం అనేది నా నైజం. సైలెంట్‌గా నా పని నేను చేస్తూ ఉండలేను. అందుకే కాలేజ్‌లో లీడర్‌గా ఉంటాను.
రష్మికతో... రెండో సినిమా?
అవును... రష్మిక నేను మంచి ఫ్రెండ్స్.. తనతో ఇది రెండో సినిమా కాబట్టి చాలా ఈజ్‌గా చేశాం. ఆమెనే కాదు రాహుల్ రామకృష్ణ లాంటి వాళ్లతో రెండోసారి చేసినప్పుడు కొన్ని కంఫర్ట్ లెవెల్స్ పెరగటంతో ఇంకా ఈజ్‌గా చేస్తాం. ఇందులో తనది లిల్లీ అనే పాత్ర. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. మన సొసైటీలో ఉన్న పదిమంది అమ్మాయిల్లో తొమ్మిది మంది కథ ఇది.
దర్శకుడు భరత్‌కమ్మ గురించి?
భరత్ చేసిన షార్ట్ఫిలిమ్స్ చూశా. అతను ఈ కథను అర్జున్‌రెడ్డి షూటింగ్ టైంలో చెప్పాడు. అప్పటినుండి కథను ఫాలోఅవుతూనే ఉన్నా. నా మనసుకు బాగా దగ్గరైన సినిమా. భరత్ చెప్పిన దానికంటే ఇంకా బాగా తీశాడు.
నాలుగు భాషల్లో విడుదలచేయాలన్న ఆలోచన ఎవరిది?
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాకు మ్యూజిక్, కెమెరా మలయాళీ వ్యక్తులు. హీరోయిన్ కన్నడ అమ్మాయి, నేను, దర్శకుడు తెలుగు. ఇలా అన్ని భాషల వాళ్లం ఉన్నాం కాబట్టి నాలుగు భాషల్లో విడుదల చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది. కానీ అది మైత్రీలాంటి బ్యానర్‌వల్లే సాధ్యమైంది.
ముద్దు సన్నివేశాలపై మీ అభిప్రాయం?
సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఆయా పాత్రల ఎమోషన్. అక్కడ ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తున్నాయి అన్న విషయంలో నేను కనిపించకూడదు. ఇప్పుడు ఈ సినిమాలో మీకు విజయ్ కనిపించకూడదు, బాబీ కనిపించాలి. అవి కథలనుబట్టి, ఆయా పాత్రలనుబట్టి ఉంటాయి తప్ప, కావాలని పెట్టే ముద్దు సన్నివేశాలు హిట్ ఇవ్వవు.
ఇప్పుడు కూడా కొత్త దర్శకులతో సినిమాలు చేస్తారా?
తప్పకుండా చేస్తా. కొత్త దర్శకులు కొత్తకొత్త ఆలోచనలతో వస్తున్నారు. మేము మొదలుపెట్టినప్పుడు కొత్తవాళ్లమే కదా. ఇక్కడ స్టార్ దర్శకులు ఊరికే అవకాశాలు ఇవ్వరు. మనలను మనం ప్రూవ్ చేసుకుంటేనే అవకాశాలు వస్తాయి. నేను హీరోగా అవ్వాలనుకున్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశా. అప్పుడు మనం ఎవరో ఎవరికీ తెలియదు కదా. అందుకే మనలా తపన ఉండి, దర్శకులుగా అవ్వాలని ప్రయత్నించే వాళ్లకోసం చూసా. అప్పుడే నాకు తరుణ్, సందీప్, భరత్‌లు కలిశారు. వాళ్లతో సినిమా చేయడంతో ఇలా సక్సెస్ అందుకున్నాను.
పూరి జగన్నాథ్‌తో సినిమా అంటున్నారు?
నేను కూడా ఆ న్యూస్ విన్నాను. ఈ సినిమా గురించి నాకైతే తెలియదు. అవి రూమర్స్ మాత్రమే.
కొరటాల శివ కూడా మీతో సినిమా చేస్తానని అంటున్నాడు?
అవును. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నాకోసం ఓ కథను రెడీ చేస్తానని చెప్పాడు, చూద్దాం.
నెక్స్ట్ సినిమాలు...?
ప్రస్తుతం క్రాంతిమాధవ్ సినిమా అరవై శాతం షూటింగ్ పూర్తయింది. దానికి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. అలాగే హీరో సినిమా. దాంతోపాటు ఓ కొత్త దర్శకుడితో మరో సినిమా ఉంటుంది.