రానా సరసన ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో వరుస సినిమాలు చేస్తూ అదే రేంజ్‌లో విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది గ్లామర్ భామ రెజీనా. అందం, అభినయం అన్నీ పుష్కలంగా వున్న ఈ భామకు అదృష్టం మాత్రం కాస్త తక్కువనే చెప్పాలి. వరుసగా హిట్స్ అందుకుంటున్నా కూడా ఈమెకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం మాత్రం దక్కడంలేదు. ఇప్పటికే గోపీచంద్, సాయిధరమ్‌తేజ్, రవితేజ, మనోజ్ వంటి హీరోల సరసన నటించిన ఈ భామకు స్టార్ హీరోల సరసన నటించాలని తెగ ఆసక్తిగా వుంది. ప్రస్తుతానికి మాత్రం రానా హీరోగా రూపొందే చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. దాంతోపాటు నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘ప్రేమమ్’ రీమేక్‌లో మూడో హీరోయిన్‌గా ఎంపికైంది. మొత్తానికి చిన్న హీరోల సరసన బాగానే అవకాశాలు వస్తున్న ఈ భామకు స్టార్ ఇమేజ్ మాత్రం దూరంగానే వుంటోంది. ఏదేమైనా వరుసగా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి వాటిని చేసుకుంటూ పోవడమే తన పని అని చెబుతోంది.