విలన్ పాత్రలు కొనసాగిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఒక విచిత్రం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆది పినిశెట్టి ఆ తరువాత విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తెలుగులో కంటే కూడా తమిళంలో మంచి పాపులారిటీ ఉంది. తాజాగా ఈయన నెగిటివ్ రోల్‌లో నటించిన చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రంలో విలన్‌గా కనిపించిన ఆదికు మంచి అభినందనలు అందుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా నటుడు ఆది చెప్పిన విషయాలు..
* ఈ సినిమాలో మీ పాత్రకు వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది?
- తెలుగుతోపాటు తమిళంలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు వచ్చిన ఫోన్‌కాల్స్ మరే సినిమాకు నాకు రాలేదు. ప్రతి ఒక్కరు కాల్ చేసి మెచ్చుకుంటున్నారు. తమిళంలో డిఫరెంట్ కానె్సప్ట్‌తో వచ్చే సినిమాలు బాగా నడుస్తాయి. ‘సరైనోడు’ పక్కా కమర్షియల్ సినిమా అయినా.. అక్కడ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. గ్రాండియర్‌గా ఉందంటున్నారు. నా నటన చూసి ‘తని ఒరువన్’ సినిమాలో అరవింద్‌స్వామి గారితో పోలుస్తున్నారు.
* నెగిటివ్ రోల్స్ కంటిన్యు చేస్తారా?
- హీరోగా భిన్నమైన సినిమాలు చేయాలనీ వచ్చాను.. అయితే పాత్ర ఆసక్తికరంగా అనిపిస్తే విలన్ రోల్స్‌లో నటించడానికి సిద్ధం. అయితే కథ ఇంటరెస్టింగ్‌గా ఉండడంతోపాటు పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న సినిమా అయితేనే నటిస్తాను. భారీ బడ్జెట్ సినిమా, చిన్న సినిమా అని ఆలోచించను.
* ఈ సినిమా ఎలా సెట్ అయింది?
- అల్లు అరవింద్ ఫోన్‌చేసి ఒక కథ విను. నీకు నచ్చితేనే చెయ్.. లేదంటే మొహమాట పడకుండా చెప్పేయ్ అన్నారు. అయితే 25 నిమిషాల నేరేషన్ వినగానే నేను ఖచ్చితంగా ఈ సినిమాలో భాగమవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను చేసింది సాధారణ విలన్ పాత్ర కాదు. చాలా పవర్‌ఫుల్‌గా ఉండే రోల్ కాబట్టి ఓకే చెప్పా.
* పాత్రకోసం ఏదైనా హోమ్‌వర్క్ చేసారా?
- విలన్ రోల్ అనగానే షూటింగ్‌కు రాకముందే విలన్‌గా ఎలా కనిపించాలా అని ప్రాక్టీస్ చేశా. అయితే షూటింగ్ స్పాట్‌కు వెళ్ళగానే బోయపాటిగారి మైండ్‌లో నేను అనుకున్నదానికంటే పవర్‌ఫుల్ విలన్ ఉన్నాడు. కాబట్టి నా ఆలోచనను పక్కనపెట్టి బోయపాటిగారు చెప్పినట్లు విన్నాను. కాని నేను బోయపాటిగారు చెప్పిన దాంట్లో కేవలం నలభైశాతం మాత్రమే నటించాను.
* అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడం?
- సినిమాలో నా పాత్రకోసం నేను బన్నీతో ప్రత్యేకంగా డిస్కస్ చేయలేదు. షూటింగ్ సమయంలో మాత్రం చేసేవాడిని. మా ఇద్దరిమధ్య హెల్థీ డిస్కషన్స్ జరిగేవి. బన్నీకి నా రోల్ బాగా నచ్చింది. తనలో మంచి కసి ఉంది. ఈ సినిమాను తన భుజాలపై నడిపించాడు. అలాగే ఈ సినిమాను మరొక లాంగ్వేజ్‌లో చేస్తే ‘నీ రోల్ నేను పోషిస్తా’ అని చెప్పాడు.
* పరిశ్రమనుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
- ఈ సినిమా చూసిన చాలామంది ఫోన్స్‌చేసి అభినందిస్తున్నారు. చిరంజీవి, వినాయక్, టెక్నీషియన్స్ ఇలా అందరూ ఫోన్ చేశారు. ముఖ్యంగా చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్‌చేసి ఐదు నిమిషాలపాటు మాట్లాడారు. మొదటిసారి ఆయన నాకు ఫోన్‌చేసి మాట్లాడారు. నిజంగా ఆయన ప్రశంస మరవలేను. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అది.
* హీరోగా చేస్తూనే, విలన్‌గా కూడా నటిస్తారా?
- నా నెక్స్ట్ సినిమాలు డిఫరెంట్‌గా ఉంటూ.. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా బ్యాలన్స్ చేసుకుంటూ చేయాలనుకుంటున్నాను. నా నెక్స్ట్ రెండు సినిమా ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాను.
* సినిమా చూసిన తరువాత ఇంకా బెటర్‌గా చేయాల్సింది అని అనిపించిన సన్నివేశాలు ఉన్నాయా?
- ప్రతి సీన్ బెటర్‌గా చేయాలనిపిస్తుంది.. నేను చేసిన సినిమాలు చూసుకొని ఇంకా బెటర్‌గా చేస్తే బావుంటుందని అనుకుంటాను. ఈ సినిమా విషయంలో కూడా అంతే..
* నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
- ప్రస్తుతానికి ఓ సినిమా తెలుగు, తమిళ భాషలలో చేస్తున్నాను, ఇంకా తెలుగులో చర్చలు జరుగుతున్నాయి, ఏది కమిట్ కాలేదు.
* మరి పెళ్ళెప్పుడు?
- ప్రస్తుతానికి ఇంట్లో నాకు పెళ్లిచేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నాను (నవ్వుతూ...) తెలుగమ్మాయినే పెళ్లిచేసుకుంటా.

-శ్రీ