అదే పెద్ద సలహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మానాన్నలిద్దరూ -సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. కానీ, ప్రత్యేకంగా నాకెలాంటి సలహాలూ ఇవ్వలేదు. వాళ్లిచ్చిన ఒకే ఒక్క మంచి సలహా -ఇండస్ట్రీలో ఎవ్వరికీ సలహాలివ్వొద్దని. అంతేకాదు, ప్రపంచ అగ్రస్థాయి నటీనటులనైనా కొందరు మెచ్చుకుంటారు. కొందరు నొచ్చుకుంటారు. సో, కామెంట్లు పట్టించుకోకుండా కెరీర్‌ను ఎంజాయ్ చేయమన్నారు. అదే పాటిస్తున్నా.

శర్వానంద్, కాజల్, కల్యాణి ప్రియదర్శిన్ కాంబోలో దర్శకుడు
సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రం -రణరంగం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఆగస్టు 15న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా సోమవారం కల్యాణి ప్రియదర్శన్ మీడియాతో ముచ్చటించింది.
రణరంగం -ఓ డాన్ ఎదుగుదలను చూపించే కథ. దర్శకుడు సుధీర్‌వర్మ కథ చెప్తున్నపుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. పాస్ట్ నుంచి ప్రజెంట్‌కు జర్నీ చేసే 1990ల నాటి కథే అయినా, ఓ వ్యక్తి లైఫ్‌ని చూపించే కోణంలోనే కథనం ఉంటుంది. ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే కావడంతో వెంటనే ఓకే చెప్పేశాను.
నా పాత్ర గురించి చెప్పడం కంటే -సినిమా మొత్తం నడిచే శర్వా పాత్ర కోణం నుంచి నా పాత్రను చూడాలి. అప్పుడే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. శర్వా పాత్ర సినిమా మొత్తం ఓ ఇంటెన్స్‌తో సాగుతుంది. కాకపోతే, ఆ పాత్రకుండే ఓ లైటర్ లైఫ్‌లో లవబుల్ సైడ్ నేను కనిపిస్తా. గీత అనే విలేజ్ టైప్ గాళ్‌గా కనిపిస్తా. వెరీ ఇంట్రెస్టింగ్ డిజైన్డ్ క్యారెక్టర్.
1990ల కాలంనాటి కథ కదా. ఆ కాలమానానికి తగినట్టే నా అప్పియరెన్స్ ఉంటుంది. అందుకే హాఫ్ శారీస్ వేయాల్సి వచ్చింది. నిజంగా -హాఫ్ శారీ ఇదే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఆ మేకోవర్‌లో నన్ను చూసి పేరెంట్స్ చాలా సంబరపడిపోయారు.
చెప్పానుగా.. ఇది కంప్లీట్ శర్వా సినిమా. ఓ 20ఏళ్ల జీవితానికి సంబంధించి కథ. ఆ కథలో నా పాత్రకు తగినంత స్పేస్ ఉంది. అతని లైటర్ లైఫ్‌లో నేను కంప్లీట్‌గా కనిపిస్తా.
గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడే అలాంటి యాక్షన్ సినిమాలు ఇష్టంగా చూసేదాన్ని. అలాంటిది -అలాంటి సినిమాలో ఓ పాత్ర చేస్తానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమాలో గన్ కూడా పట్టుకుంటా. అమాయకమైన ఫేస్‌కీ, గన్‌కి ఏమైనా సూటవుతుందా? అని నన్ను ఆటపట్టించేవారు. బట్, ఈ సినిమాలో గన్ పట్టుకున్న సీన్ కూడా ఒకటి చేసేశాను.
ఇంతకుముందు తెలుగులో నేను చేసిన హలో, చిత్రలహరి సినిమాల్లో కొంత అమాయకంగా, పూర్తి మెచ్యూరిటీ లేని పాత్రలు చేశా. రణరంగం సినిమాలో మాత్రం గీతగా -ఆ పాత్రల కంటే కాస్త మెచ్యూర్డ్‌గా కనిపిస్తా.
ఈ సినిమా జర్నీ చాలా హ్యాపీగా జరిగిపోయింది. రోజూ -లేచిన దగ్గర్నుంచి షూట్, నా పాత్రను ఆలోచించుకోవడం.. ఇలా తెలీకుండా గడిచిపోయింది. ట్రైలర్ చూసిన తరువాత కొంత ఎగ్జైట్‌మెంట్ మొదలైంది.
అవకాశాలు బాగానే వస్తున్నాయి. కాకపోతే -ఎక్కువగా మలయాళం, తమిళంపై ఫోకస్ పెడుతున్నా. ఎందుకంటే -ఆ లాంగ్వేజెస్ నాకు బాగా తెలుసు. ఒక ఆర్టిస్ట్‌గా ముందు బలంగా నిలదొక్కుకోవాలన్నది నా ఆలోచన. అలాగని తెలుగుకు దూరం కాను.
తెలుగు భాషలో ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పదాలు నేర్చుకుంటున్నా. ఈ భాష బాగా నచ్చింది. స్వీట్ సౌండింగ్. కొత్త భాష నేర్చుకోడానికి ఎవ్వరికైనా ఉండే బెరుకే నాకూ ఉంది. కొంతమంది చాలా సులువుగా నేర్చేసుకుంటారు. నాకు అంత పరిజ్ఞానం లేదు. బట్, నేర్చుకుంటా.