వజ్రకోడూర్‌లో నిధుల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కమల్ కథానాయకుడిగా చలనచిత్ర కంబైన్స్ పతాకంపై టి.రాము దర్శకత్వంలో మనీష్ గౌడ్, మనీషా రూపొందిస్తున్న చిత్రం ‘వజ్రకోడూర్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు టి.రాము మాట్లాడుతూ- త్వరలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసి మేలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అడవులలో, పురాతన భవనాలలో, నిధుల అనే్వషణ ప్రధాన అంశంగా తీసుకొని రూపొందించిన ఈ చిత్రంలో అఘోరాలతో చిత్రించిన సన్నివేశాలు ప్రేక్షకులకు గగుర్పాటు కలిగిస్తాయని, దుష్టులను శిక్షించటానికి దుర్గాదేవి లీలలు ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తాయని ఆయన తెలిపారు. ఓ సంఘంలో జరుగుతున్న అరాచకాల నేపథ్యంలో రాసుకున్న ఈ కథనం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, పాటలు హైలెట్‌గా వుంటాయని ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణంగా నిలుస్తుందని ఆయన అన్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సత్యనారాయణరాజు, మోహన్‌రెడ్డి, విశ్వనాధరెడ్డి, వినోద్, కనకయ్య, సుందరమ్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:నారాయణ, సంగీతం:ఆదివిష్ణు, పాటలు:సీతారామ్‌చౌదరి, సమర్పణ:మనీష్‌గౌడ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:టి.రాము.