ఈ గ్యాంగ్‌స్టర్‌కు వాడే.. గాడ్‌ఫాదర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణరంగం ఓ గ్యాంగ్‌స్టర్ కథ. ఈ కథకు శర్వానంద్ గాడ్‌ఫాదర్ అంటున్నాడు దర్శకుడు సుధీర్ వర్మ. శర్వానంద్, కాజల్, కల్యాణి ప్రియదర్శిన్ కాంబోలో దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రం -రణరంగం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై
సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఆగస్టు 15న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా మంగళవారం దర్శకుడు సుధీర్‌వర్మ మీడియాతో ముచ్చటించారు.

గ్యాంగ్‌స్టర్ కంటెంట్‌తో కథల్లుకోవాలంటే -గాడ్‌ఫాదర్ సిరీస్ రిఫరెన్స్‌కెళ్లాలి. ఆ సిరీస్‌ని చాలాసార్లు చూసుంటాను. బహుశ -ఆ ఇంటెన్స్ స్క్రీన్‌ప్లే ఇంపాక్ట్ ‘రణరంగం’ మీద ఉండిఉండొచ్చు. సీన్స్‌పరంగా ఏదీ తీసుకోలేదు కానీ, గాడ్‌ఫాదర్ చనిపోయిన తరువాత కొడుకు ఎలా గాడ్‌ఫాదర్‌గా ఎదిగాడన్న డిజైన్‌లోనే శర్వా పాత్ర కనిపించొచ్చు.

ఒక్కోసారి -మర్డర్ లేకుండా కథల్లుకోవడం కష్టమేమో అనిపిస్తుంటుంది. ఫస్ట్‌టైం -శర్వా, కల్యాణి లవ్ ట్రాక్ డిజైన్ చేశాక.. మంచి కంటెంట్ దొరికితే క్యూట్ లవ్ స్టోరీ చేయగలనన్న ఫీలింగ్ కలిగింది. బట్, అథెంటిసిటీ లేకుండా అటెమ్ట్ చేయడం నాకు నచ్చదు. మంచి కథ దొరికితే -లవ్ బేస్డ్ మూవీ చేస్తానేమో.
రణరంగానికి ఇన్‌స్పిరేషన్?
గాడ్‌ఫాదర్ ఇంటెన్సిటీ. నేను అనుకున్న కథకు -అలాంటి స్క్రీన్‌ప్లే ఫార్మాట్ వర్కౌటైంది. ట్రీట్‌మెంట్ కూడా ఫ్లాష్‌బ్యాక్, లైవ్ స్టోరీ అన్నట్టు కాకుండా -బ్యాక్ అండ్ ఫోర్త్ చెప్పడం ప్లస్సైంది.
స్క్రీన్‌ప్లే ఫార్మాటేనా? సీన్స్ తీసుకున్నారా?
డైరెక్ట్ సీన్స్ ఏమీ తీసుకోలేదు. కాకపోతే.. గాడ్‌ఫాదర్ చనిపోయాక -సెకెండ్ పార్ట్‌లో కొడుకు ఎలా ఎదిగి గాడ్‌ఫాదర్ అయ్యాడన్న స్కీం ఉంటుంది. ఆ స్క్రీన్‌ప్లే డిజైన్‌ను శర్వా పాత్రకు అన్వయించా. కాకపోతే -ద అసాసినేషన్ ఆఫ్ జెస్సీ జేమ్స్ అనే హాలీవుడ్ స్టోరీలోని ట్రెయిన్ సీక్వెన్స్ మాత్రం యథాతథంగా తీయడానికి ప్రయత్నించాం. ఎంతవరకూ సక్సెస్ అయ్యామన్నది ఆడియనే్స చెప్పాలి.
శర్వానే ఎంచుకున్నారెందుకు?
కాదు, శర్వానే కథను ఎంచుకున్నాడు. మరో కథగురించి శర్వాతో డిస్కస్ చేస్తున్న సందర్భంలో దీని లైన్ చెప్పాను. అదీ, రవితేజతో చేస్తున్నట్టు చెప్పాను కూడా. వారం తరువాత -అలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయాలని ఉంది. రవికి మరొకటి చెప్పమని రిక్వెస్ట్ చేశాడు. అలా కథలోకి శర్వా వచ్చాడు.
శర్వానంద్ పెర్ఫార్మెన్స్..?
శర్వా సినిమాల్లో ప్రస్థానం నాకు నచ్చిన సినిమా. తనతో ఏం చేసినా ఇంటెన్సిటీ ఉన్న సినిమాయే చేయాలనుకునేవాణ్ని. అతను చేసిన ఫ్యామిలీ, లవ్‌స్టోరీలు హిట్టయినా అలాంటి థాట్ నాకు రాలేదు. అతన్ని ఇంటెన్స్ క్యారెక్టర్‌లోనే అనుకున్నాను. ఇది సెట్టయ్యింది.
గ్యాంగ్‌స్టర్స్ కథలు చాలా వచ్చాయిగా?
వచ్చి ఉండొచ్చు. బట్, దీని స్క్రీన్‌ప్లే డిఫరెంట్. పైగా కథాకాలం నేపథ్యం కూడా వైవిధ్యంగా ఉంటుంది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న టైంలో మద్య నిషేధం అమలైంది. చంద్రబాబు సీఎం అయిన తరువాత ఎత్తేశారు. ఆ నిషేధ కాలం బ్యాక్‌డ్రాప్‌లో ఇంతవరకూ తెలుగులో కథలు రాలేదు. నేను ఆ కాలాన్ని కథా నేపథ్యంగా తీసుకుని చేశాను. ఓ కుర్రాడు గ్యాంగ్‌స్టర్‌గా ఎదగడానికి ఓ నేపథ్యం ఉండాలి కనుక -ప్రొహిబిషన్ పీరియడ్‌ని తీసుకున్నానంతే.
నైన్టీస్ స్టోరీ రన్నవుతుందా?
ఔను. ఆ కాలంలో మద్యం స్మగ్లింగ్ ఎలా జరిగేదన్న ఇన్సిడెంట్స్‌ను స్టడీ చేసి కథను అల్లుకున్నా. సముద్రం విజువల్స్ బావుంటాయి కనుక -ఒరిస్సా టు విశాఖ నేపథ్యంగా కథ చెప్పాను. ఆనాటి కథాకాలం నుంచి శర్వా పాత్ర ఎలా ఎదిగిందన్నదే ప్రథాన కథాంశం. అదే బ్యాక్ అండ్ ఫోర్త్‌లో ఉంటుంది.
టైటిల్ జస్ట్ఫికేషన్?
ఓ గ్యాంగ్‌స్టర్ లైఫ్ స్ట్రగుల్ కథ కనుక -రణరంగం అన్నాం. ఓ వ్యక్తి యుద్ధ క్షేత్రానికి సంబంధించిన కథ. నిర్మాత వంశీ యాదృచ్ఛికంగా సజెస్ట్ చేశాడు. అందరికీ నచ్చింది. రణరంగం కంటిన్యూ చేశాం.
లవ్ ట్రాక్ బావుందంటున్నారు త్రివిక్రమ్?
విడుదలకు సిద్ధమైన సినిమాగానే త్రివిక్రమ్ చూశారు. ఆయన ఫీల్‌ను ఆయన చేప్పారు. అంతేతప్ప సజెషన్స్ ఏమీ లేవు. ఇప్పటి వరకూ క్రైమ్, వయొలెన్స్ థాట్స్‌తోనే నా సినిమాలు చేశాను. ఇందులో లవ్ ట్రాక్‌కూ అప్లాజ్ వస్తుంటే -మంచి కంటెంట్ దొరికితే సినిమా చేయొచ్చన్న ఫీల్ కలుగుతోంది.
ట్రైలర్‌లో కాజల్‌ని అండర్‌ప్లే చేశారు?
కావాలనే చేశాం. కాజల్ ఇమేజ్ వేరు. బట్, ఈ సినిమాలో ఇంటెన్స్‌వున్న చిన్న పాత్రకు ఆమె సూట్ అవుతారని అనిపించింది. అడిగిన వెంటనే చేశారు. ఆమెను ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తే -మెయిన్ లీడ్స్‌తో సమానంగా ఆమె కనిపించొచ్చన్న భావనతో ఆడియన్స్ వస్తారు. అలా అప్‌సెట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆమెను ఎక్కువ ప్రొజెక్ట్ చేయడం లేదు.
ప్రాజెక్టుకు రెండేళ్లు పట్టింది?
రెండేళ్ల క్రితం మొదలుపెట్టాం తప్ప, అంత షూట్ చేయలేదు. శర్వా పడిపడిలేచె మనసు సినిమా చేయాల్సి రావడంతో -ఈ కథకు అనుగుణంగా మళ్లీ మేకోవర్ తేవడానికి కొంచెం టైంపట్టింది. అంతే తప్ప, రెండేళ్లు చేసిన ప్రాజెక్టు కాదు.
సినిమా ఎలా అనిపిస్తోంది?
చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో ఇదే ఛాలెంజింగ్ ప్రాజెక్టు కూడా. కథపరంగా గతం.. వర్తమానం రెండు కథాకాలాలు డిజైన్ చేయడం, షూట్ చేయడానికి ఎక్కువ కేర్ తీసుకోకతప్పలేదు. కెమెరా, మేకింగ్, మ్యూజిక్.. ఇలా టెక్నికల్ టీం కూడా చాలెంజింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్, హ్యాపీ.
సీక్వెల్ చేసే ఆలోచన..?
ఇది సక్సెస్ అయ్యాక అప్పుడు ఆన్సర్ చేస్తా. నిజానికి -శర్వా ఓ పాయింట్ చెప్పాడు. అది సీక్వెల్‌కి కరెక్ట్‌గా సూటవుతుంది. ఇప్పుడే రివీల్ చేయలేను. అయినా, దీని రిజల్ట్ తరువాత కదా సీక్వెల్ గురించి మాట్లాడేది. అప్పుడు ఆలోచిద్దాం.

-విజయ్‌ప్రసాద్